England vs New Zealand Live Score in Telugu:టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ ముందు 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 సెమీ-ఫైనల్స్ తొలి పోరులో అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు వన్డే ఫార్మాట్‌లో ప్రపంచ ఛాంపియన్ ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా ఉన్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టుతో తలపడనుంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు ఫైనల్‌లో తలపడ్డాయి. ఇంగ్లండ్ జట్టు, టైటిల్ కోసం బలమైన పోటీదారుగా ఉంది. అయితే గాయపడిన ఆటగాళ్ల సమస్యతో ఇబ్బందిపడుతోంది. కొద్దిమంది ప్రముఖ ఆటగాళ్ల సహాయంతో న్యూజిలాండ్‌పై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తుంది. టోర్నమెంట్‌కు ముందే ఇంగ్లండ్‌ను టైటిల్ పోటీదారులుగా పరిగణించారు.
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్(కీపర్), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, మొయిన్ అలీ, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, లియామ్ లివింగ్‌స్టోన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డెవాన్ కాన్వే(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్
ఇంగ్లాండ్ పై జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధించింది.
ఇంగ్లాండ్ పై విజయం సాధించిన న్యూజిలాండ్..
చెలరేగుతున్న మిచెల్ ..38 బంతులకు 46 పరుగులతో న్యూజిలాండ్ ను విజయం వైపు నడిపిస్తున్న మిచెల్
పీకల్లోతు కష్టల్లో న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. న్యూజిలాండ్ స్కోర్ 147/5
కష్టాల్లో న్యూజిలాండ్ .. నాలుగో వికెట్ కోల్పోయిన కివీస్.. గ్లేన్ ఫిలిప్స్ (2) పరుగులకు అవుట్ అయ్యాడు.
మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్..కాన్వే 46 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
పదకొండో ఓవర్ లో కాన్వే తొలి బంతికి ఫోర్ బాదాడు.. అలాగే ఐదో బంతికి మిచెల్ సిక్స్ కొట్టాడు.. దాంతో స్కోర్ 73 కు చేరింది.
పది ఓవర్లకు న్యూజిలాండ్ 58 పరుగులు చేసింది. కాన్వే (26), మిచెల్ (22) క్రీజ్ లో ఉన్నారు. ఇద్దరు ఆటగాళ్లు ఆచితూచి ఆడుతున్నారు.
18/2 vs Pak
39/0 vs Ind
18/1 vs Sco
19/1 vs Nam
16/1 vs Afg
22/0 vs Eng
10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం 2 వికెట్లు నష్టపోయి 58 పరుగులు సాధించింది. క్రీజులో మిచెల్ 22, కాన్వే 26 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. వీరిద్దరి భాగస్వామ్యం కూడా 45(44) పరుగులకు చేరుకుంది.
166 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ చేస్తోన్న కివీస్ టీం 9 ఓవర్లు ముగిసే సరికి 2వికెట్లు కోల్పోయి 50 పరుగులు సాధిచింది. టాస్ గెలిచిన ఆనందం లేకుండా పోయిన న్యూజిలాండ్‌కు ఇంగ్లండ్ టీం భారీ టార్గెట్‌నే నిర్ధేశించింది.
8 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం 2 వికెట్లు నష్టపోయి 45 పరుగులు సాధించింది. క్రీజులో మిచెల్ 18, కాన్వే 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
7 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం 2 వికెట్లు నష్టపోయి 41 పరుగులు సాధించింది. క్రీజులో మిచెల్ 16, కాన్వే 15 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
31/4 vs WI (Won)
27/3 vs Ban (Won)
21/3 vs Aus (Won)
40/3 vs SL (Won)
40/1 vs SA (Lost)
36/2 vs NZ
5 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం 2 వికెట్లు నష్టపోయి 26 పరుగులు సాధించింది. క్రీజులో మిచెల్ 11, కాన్వే 5 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
వోక్స్ వేసిన 2.4 బంతికి కివీస్ కెప్టెన్ విలియమ్సన్ 5 పరుగుల వద్ద రషీద్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో న్యూజిలాండ్ టీం 2.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 13 పరుగులు చేసింది.
వోక్స్ వేసిన బంతికి మార్టిన్ గుప్తిల్ 4 పరుగుల వద్ద మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి తొలి ఓవర్‌లోనే తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో న్యూజిలాండ్ టీం 0.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి 4 పరుగులు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ ముందు 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
18 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ టీం మూడు వికెట్లు నష్టపోయి 146 పరుగులు సాధించింది. క్రీజులో అలీ 43, లివింగ్ స్టోన్ 10 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
ఇష్ సోధి వేసిన బంతికి డేవిడ్ మలాన్ (42 పరుగులు, 30 బంతులు, 4 ఫోర్లు, సిక్స్) కాన్వేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లండ్ టీం 15.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది.
14 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ టీం రెండు వికెట్లు నష్టపోయి 100 పరుగులు సాధించింది. క్రీజులో అలీ 17, మలాన్ 34 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
పది ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ టీం రెండు వికెట్లు నష్టపోయి 67 పరుగులు సాధించింది. క్రీజులో అలీ 4, మలాన్ 15 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
ఇష్ సోధి వేసిన బంతికి బట్లర్(29 పరుగులు, 24 బంతులు, 4 ఫోర్లు) ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లండ్ టీం 8.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసంది.
30/1 v Pak
35/2 v Ind
48/1 v Sco
36/0 v Nam
23/3 v Afg
40/1 v Eng
మిల్నే వేసిన బంతికి జానీ బెయిర్‌స్టో(13 పరుగులు, 17 బంతులు, 2 ఫోర్లు) విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
బౌల్ట్ వేసిన 4వ ఓవర్‌లో మూడు ఫోర్లతో మొత్తం 16 పరుగులు వచ్చాయి.
మూడు ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ టీం వికెట్ నష్టపోకుండా 13 పరుగులు సాధించింది. క్రీజులో బెయిర్‌స్టో 7, బట్లర్ 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్(కీపర్), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, మొయిన్ అలీ, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, లియామ్ లివింగ్‌స్టోన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డెవాన్ కాన్వే(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్
న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లండ్ టీం బ్యాటింగ్ చేయనుంది.
ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మరోసారి నాకౌట్ మ్యాచ్ జరగనుంది. 2019 ప్రపంచకప్‌లో చివరి సారి ఫైనల్‌లో తలపడ్డారు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్‌లో ఆడిన ముగ్గురు పెద్ద హీరోలు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్, లియామ్ ప్లంకెట్ ఈ మ్యాచ్‌లో భాగం కావడం లేదు. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈసారి ఇంగ్లిష్ కెప్టెన్ మోర్గాన్‌ను ఓడిస్తాడో లేదో చూడాలి.