IND vs ENG: టీమిండియా ప్లేయర్లతో సరికొత్తగా ఫీల్డింగ్‌ ప్రాక్టీస్.. శ్రీధర్ ఐడియా అదుర్స్ అంటోన్న నెటిజన్లు

|

Aug 11, 2021 | 12:23 PM

ఇంగ్లండ్‌తో రేపు లార్డ్స్ వేదికగా జరగబోయే రెండవ టెస్టు కోసం టీమిండియా క్రికెటర్లు సన్నద్ధమవుతున్నారు. అయితే ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ చేసిన ఓ ఐడియాతో..

IND vs ENG: టీమిండియా ప్లేయర్లతో సరికొత్తగా ఫీల్డింగ్‌ ప్రాక్టీస్.. శ్రీధర్ ఐడియా అదుర్స్ అంటోన్న నెటిజన్లు
Ind Vs Eng Lords Test
Follow us on

IND vs ENG: ఇంగ్లండ్‌తో రేపు లార్డ్స్ వేదికగా జరగబోయే రెండవ టెస్టు కోసం టీమిండియా క్రికెటర్లు సన్నద్ధమవుతున్నారు. అయితే ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ చేసిన ఓ ఐడియాతో టీమిండియా ఆటగాళ్లు వీడియో నెట్టింట్లో సందడిగా మారింది. సరికొత్త ఫీల్డింగ్‌తో భారత ఆటగాళ్లతో మైదానంలో చెమటలు కక్కించాడు. ఈ మేరకు ఓ వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పంచుకుంది. దీంతో నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తూ.. వైరల్ చేస్తున్నారు. వీడియో విషయానికి వస్తే.. ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ టీమిండియా కీపర్ కం బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్‌తో కొత్త ఫీల్డింగ్ డ్రిల్‌తో ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. వీరితోపాటు ప్రసీద్ద్ కృష్ణ, వృద్ధిమాన్ సాహాతోపాటు హనుమ విహారి కూడా ఉన్నారు.

వీడియోలో భారత ఫీల్డింగ్ కోచ్ బ్యాటింగ్ చేస్తుండగా, స్టంప్స్ వెనుక పంత్‌ ఫీల్డింగ్ చేస్తున్నాడు. బౌలర్ నుంచి డెలివరీలు అందుకుంటున్న పంత్‌ను అయోమయంలో పడేసేందుకు మరో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు బాల్స్‌తో క్యాచ‌ులు ఆడుతూ దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. దృష్టి మరల్చకుండా వికెట్ తీయాల్సిదేనంటూ పంత్‌కు ఫీల్డింగ్ కోచ్ ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలుస్తుంది.

ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలసిందే. దీంతో సిరీస్‌లో ఇరుజట్లు 0-0తో ఉన్నాయి. లార్డ్స్‌లో విజయం కోసం ఇరుజట్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. లార్డ్స్‌లో టీమిండియా రికార్డు అంతగా బాగోలేదు. లార్డ్స్‌లో ఇప్పటి వరకు మొత్తం 18 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత్ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి, 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

Also Read: 70 బంతుల్లో 7గురు బౌలర్ల భరతం పట్టాడు..! 11 సిక్సర్లు, 9 ఫోర్లతో 140 పరుగులు చేశాడు.. ప్రత్యర్థికి దడ పుట్టించాడు..

‘ప్రపంచ నాయకుల్లారా.. మాకు శాంతి కావాలి.. మమ్మల్ని గందరగోళంలోకి నెట్టొద్దు’: స్టార్ ఆల్ రౌండర్ విజ్ఞప్తి