Video: గాయం వేధించినా.. ఒంటికాలితో బ్యాటింగ్‌.. బౌలర్ డెడికేషన్‌కు ప్రేక్షకుల స్టాండింగ్ ఓవియేషన్‌.. వైరల్ వీడియో

|

Jul 02, 2023 | 7:20 AM

Nathan Lyon Video: యాషెస్ సిరీస్ 2023లో రెండో టెస్ట్ మ్యాచ్ లండన్‌లోని లార్డ్స్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతోంది. శనివారం రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 279 పరుగులకు ఆలౌటైంది. ఈ సందర్భంగా మైదానంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది.

Video: గాయం వేధించినా.. ఒంటికాలితో బ్యాటింగ్‌.. బౌలర్ డెడికేషన్‌కు ప్రేక్షకుల స్టాండింగ్ ఓవియేషన్‌.. వైరల్ వీడియో
England Vs Australia Injure
Follow us on

Nathan Lyon Video England vs Australia: యాషెస్ సిరీస్ 2023లో రెండో టెస్ట్ మ్యాచ్ లండన్‌లోని లార్డ్స్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతోంది. శనివారం రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 279 పరుగులకు ఆలౌటైంది. ఈ సందర్భంగా మైదానంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఆసీస్ జట్టు స్టార్ బౌలర్ నాథన్ లయన్ గాయపడినప్పటికీ బ్యాటింగ్‌ చేసేందుకు వచ్చాడు. లయన్ 4 పరుగులు కూడా చేశాడు. నాథన్ బ్యాటింగ్‌కు రాగానే ప్రేక్షకులు ఘన స్వాగతం పలికారు.

లయన్ లార్డ్స్ టెస్టు మ్యాచ్‌లో గాయపడ్డాడు. అయితే, అతను రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగి, ప్రేక్షకులతోపాటు ప్రత్యర్థి ఆటగాళ్లను కూడా ఆశ్చర్యపరిచాడు. మైదానానికి చేరుకోగానే ప్రేక్షకులు చప్పట్లతో స్వాగతం పలికారు. స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. గాయపడి, కాలుతో కుంటుకుంటూనే రన్స్ కోసం పరిగెత్తాడు. లయన్ 13 బంతులు ఎదుర్కొని 4 పరుగులు చేశాడు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, లయన్ వీడియోను ఇంగ్లాండ్ క్రికెట్ ట్వీట్ చేసింది. ఆయనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అభిమానులు కూడా నాథన్ వీడియోను ట్వీట్ చేస్తూ.. ప్రసంశలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 279 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ సమయంలో, ఉస్మాన్ ఖవాజా 77 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 25 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్ అవుటయ్యాడు. లబుషేన్ 30 పరుగులు చేశాడు. స్టీవ్ స్మిత్ 34 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు. అలెక్స్ కారీ 21 పరుగులతో అవుటయ్యాడు. ట్రావిస్ హెడ్ 7 పరుగుల వద్ద, గ్రీన్ 18 పరుగుల వద్ద ఔటయ్యారు. ఇంగ్లండ్‌ తరపున బ్రాడ్‌ 4 వికెట్లు పడగొట్టాడు. రాబిన్సన్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇంగ్లండ్‌ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. అయితే, ఈ మ్యాచ్ ఫలితంపైనా టెన్షన్ నెలకొంది. ఆస్ట్రేలియాకే విజయావకాలు అధికంగా ఉన్నాయి. ఇంగ్లండ్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..