ENG vs SL: శ్రీలంకను వెంటాడిన పవర్ ప్లే గండం.. 11 వికెట్లతో లంకేయుల తాటతీసిన ఇంగ్లండ్ బౌలర్లు..!

|

Jul 05, 2021 | 3:26 PM

శ్రీలంక జట్టుకు ఇంగ్లండ్ పర్యటన ఓ పీడకలలా మారింది. ఈ పర్యటనలో లంకేయులకు ఏ విషయంలోనూ కలిసిరాలేదు. టీ 20 సిరీస్ ను వైట్ వాష్ తో దూరం చేసుకోగా, వన్డే సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేసింది ఇంగ్లండ్ జట్టు.

ENG vs SL: శ్రీలంకను వెంటాడిన పవర్ ప్లే గండం.. 11 వికెట్లతో లంకేయుల తాటతీసిన ఇంగ్లండ్ బౌలర్లు..!
Eng Vs Sl 3 Odis
Follow us on

ENG vs SL: శ్రీలంక జట్టుకు ఇంగ్లండ్ పర్యటన ఓ పీడకలలా మారింది. ఈ పర్యటనలో లంకేయులకు ఏ విషయంలోనూ కలిసిరాలేదు. టీ 20 సిరీస్ ను వైట్ వాష్ తో దూరం చేసుకోగా, వన్డే సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేసింది ఇంగ్లండ్ జట్టు. మ్యాచ్ విషయంలోనే ఇలా ఉంటే.. ఆటగాళ్ల పరిస్థితి చూస్తే మరోలా ఉంది. బయో బబుల్ రూల్స్ ను పాటించకుండా వన్డేల నుంచి నిషైధానికి గురయ్యారు ముగ్గురు శ్రీలంక ఆటగాళ్లు. దీంతో లంక టీంపై మాజీలతోపాటు అభిమానుల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. రానున్న టీ20 వరల్డ్ కప్ లో ఇలాగే ఆడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. సంగర్కర, డిసిల్వా, జయసూర్య వంటి మేటి ఆటగాళ్లను ప్రపంచ క్రికెట్ కు అందించిన శ్రీలంక జట్టు ఇదేనా అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన వన్డే సిరీస్ లో శ్రీలంక ఆటగాళ్లు పవర్ ప్లేలో 11 మంది బ్యాట్స్ మెన్ల వికెట్లను కోల్పోయింది. ఇదే వన్డే సిరీస్ లో ఘోరంగా ఓడిపోయేందుకు పెద్ద కారణంగా మారింది. బ్రిస్టల్ లో ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన చివరి, మూడో వన్డే వర్షంతో తుడిచిపెట్టుకపోయింది. అయితే, మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీం.. 41.5 ఓవర్లలో కేవలం 166 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. శ్రీలంక టీం ఇంతకుముందెన్నడూ ఇలాంటి చెత్త ప్రదర్శన చేయలేదు.

ఇంగ్లండ్ తో జరిగిన మూడు వన్డేల్లో.. శ్రీలంక బ్యాటింగ్ ఘోరంగా తయారైంది. మరీ ముఖ్యంగా పవర్ ప్లేలో లంక బ్యాట్స్ మెన్ లు దారుణంగా పెవిలియన చేరడంతో చాలా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన మూడు వన్డేల్లో.. పవర్ ప్లేలో 10 ఓవర్లలో 50 పరుగులు కూడా చేయకుండా చేతులెత్తేశారు. ఇదే సమయంలో శ్రీలంక టీం 3 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు కోల్పోయింది. మొదటి వన్డేలో శ్రీలంక టీం మొదటి 10 ఓవర్లలో 47 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. తరువాతి వన్డేలోనూ శ్రీలంక పరిస్థితి మారుతుందని ఆశించిన అభిమానులకు రిక్తహస్తమే లభించింది. రెండో వన్డేలో పవర్ ప్లేలో 47 పరుగులు చేసి ఈ సారి 4 వికెట్లు కోల్పోయారు. ఇక చివరి వన్డేలో 45 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. మొత్తంగా మూడు వన్డేల్లో పవర్ ప్లేలో 30 ఓవర్లలో 11 వికెట్లు కోల్పోయి కేవలం 139 పరుగుల చేసింది.

శ్రీలంక ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తే.. వన్డే సిరీస్ లో ప్రతీ 16.3 బంతుల్లో శ్రీలకం వికెట్లు కోల్పోయింది. మొత్తంగా శ్రీలంక టీం కెరీర్ లో ఇలాంటి చెత్త ప్రదర్శన ఎన్నడూ ప్రదర్శించలేదు. మూడో వన్డేలో వర్షార్పణం కావడంతో.. ఇంగ్లండ్ టీం మూడు వన్డేల సిరీస్ ను 2-0 తేడాతో విజయం సాధించింది. ఇక శ్రీలంక గత మ్యాచ్ లను పరిశీలిస్తే.. గత 25 వన్డేల్లో ఇలాంటి ప్రదర్శనే కనిపిస్తోంది. మొత్తంగా 25 వన్డేల్లో కేవలం 3 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. 18 వన్డేల్లో ఓడిపోయింది. 3 మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ఒట్టి చేతులతో స్వదేశానికి బయలు దేరిన శ్రీలంక జట్టుకు.. ఇంగ్లండ్ పర్యటన చేదు అనుభవాలను మిగిల్చింది. ఇక ఇప్పుడు టీమిండియా వంతు రానుంది. ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న 5 టెస్టుల సిరస్ లో ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది.

Also Read:

UEFA Euro 2020: 25 ఏళ్ల తరువాత సెమీస్ చేరిన ఇంగ్లండ్.. డెన్మార్క్ తో అమీతుమీకి సిద్ధం..!

టీ 20 క్రికెట్‌లో డబుల్ సెంచరీ..! 79 బంతుల్లో 205 పరుగులు..17 ఫోర్లు,17 సిక్సర్లు.. ఎవరో కాదు మన ఢిల్లీ క్రికెటరే..