ఇంగ్లాండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మలన్.. కేవలం 7 ఏళ్లలోనే తన కెరీర్‌కు ముగింపు పలికాడు. అయితే ఈ చిన్న స్పాన్‌లో ఆఫ్ టైంలోనే ఈ ఆటగాడు పలు క్రేజీ రికార్డులను బద్దలుకొట్టాడు. ఇంగ్లాండ్ తరపున 22 టెస్టులు, 30 వన్డేలు, 62 టీ20 మ్యాచ్‌లు ఆడిన మలన్.. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తంగా 8 సెంచరీలు చేశాడు. ఇంగ్లాండ్‌కు టీ20 ప్రపంచకప్ అందించడమే కాకుండా.. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో చేయలేని ఫీట్‌ను సాధించి చూపించాడు.
డేవిడ్ మలన్ వన్డే, టీ20 ఫార్మాట్లలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో విధ్వంసకర బ్యాటర్ అని చెప్పొచ్చు. 62 టీ20 మ్యాచ్‌లలో 36.38 సగటుతో 1892 పరుగులు చేశాడు మలన్. ఈ ఆటగాడు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో చాలాకాలం పాటు అగ్రస్థానంలో ఉన్నాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో 900 కంటే ఎక్కువ రేటింగ్ పాయింట్లు సాధించాడు. ప్రపంచంలోని ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ కూడా చాలాకాలం పాటు టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ.. అతడి అత్యధిక రేటింగ్ పాయింట్లు 897 మాత్రమే.
డేవిడ్ మలన్ క్రికెట్ కెరీర్ విషయానికొస్తే.. ఈ ఆటగాడు దక్షిణాఫ్రికాలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2006లో ఇంగ్లాండ్‌కు మారాడు. ఆ తర్వాత ఈ ప్లేయర్ చాలాకాలం పాటు మిడిల్‌సెక్స్ తరపున ఆడాడు. ఆ తర్వాత 2017లో తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు మలన్. తొలి టీ20 మ్యాచ్‌లో మలన్ 78 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఈ వీడియో దిగువన చూడండి..
Mind out in the Pod! ⚠️
The @SkyCricket team were under fire with this Dawid Malan six pic.twitter.com/NjTWUAGM9B
— Vitality Blast (@VitalityBlast) April 22, 2024
ఇది చదవండి: ముంబైకి కొత్త కెప్టెన్‌గా టీ20 డైనమైట్.. హార్దిక్‌కు కూడా హ్యాండిచ్చేసిందిగా
అనంతరం 2020 నాటికి, ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ టీ20 ర్యాంకింగ్‌లో అగ్రస్థానానికి చేరాడు. అతడు కేవలం 24 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలోనే 1000 పరుగులు పూర్తి చేశాడు. అలాగే 2022 ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్ సాధించడంలో డేవిడ్ మలన్ జట్టులో కీలక సభ్యుడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..