
Ashes 2023: క్రికెట్ కాశీ లార్డ్స్ మైదానంలో జరిగిన యాషెస్ సిరీస్ రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తుఫాన్ బ్యాటింగ్‌తో రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో చివరి రోజు 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు స్టోక్స్ బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియన్ స్పీడ్ స్టర్ కెమెరూన్ గ్రీన్ వేసిన 56వ ఓవర్ లో సిక్సుల వర్షం కురిపించి, సెంచరీ పూర్తి చేశాడు.
ఈ ఓవర్ తొలి బంతికే ఫోర్ కొట్టి బెన్ స్టోక్స్.. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. అయితే, రెండవ బాల్ వైడ్‌గా వచ్చింది. ఆ తర్వాత రెండో డెలివరీలో భారీ సిక్సర్, 3వ, 4వ బంతుల్లో కూడా బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదేశాడు. 5వ బంతికి 1 పరుగు చేశాడు. 6వ బంతికి పరుగు లేదు. అంటే, ఒకే ఓవర్లో 24 పరుగులు చేసి స్టోక్స్ హల్ చల్ చేశాడు.
ఈ అద్భుత బ్యాటింగ్‌తో బెన్ స్టోక్స్ కేవలం 142 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. విశేషమేమిటంటే.. ఈ 24 పరుగులతో యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ తరపున ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బెన్ స్టోక్స్ ప్రత్యేక రికార్డు సృష్టించాడు.
ఇంగ్లండ్ తరపున టెస్టు క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన 2వ బ్యాట్స్‌మెన్ కూడా. ఈ జాబితాలో హ్యారీ బ్రూక్ అగ్రస్థానంలో ఉన్నాడు. హ్యారీ బ్రూక్ 2022లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 27 పరుగులు చేశాడు. జాహిద్ మహమూద్ ఓవర్‌లో పరుగుల వర్షం కురిపించాడు. టెస్టు క్రికెట్‌లో ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ సాధించిన అత్యధిక పరుగుల రికార్డు ఇదే.
6,6,6 to bring up an Ashes century at Lord’s.
Ben Stokes the captain! pic.twitter.com/C7i0uQfqoX
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 2, 2023
ఇప్పుడు బెన్ స్టోక్స్ కామెరాన్ గ్రీన్ ఓవర్‌లో 24 పరుగులు చేయడం ద్వారా ఈ జాబితాలో 2వ స్థానాన్ని ఆక్రమించాడు. యాషెస్ సిరీస్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రత్యేక రికార్డును కూడా సాధించాడు.
టెస్టు ఫార్మాట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు నెలకొల్పాడు. 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో స్టువర్ట్ బ్రాడ్ ఓవర్‌లో బుమ్రా మొత్తం 35 పరుగులు చేశాడు.
ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన లార్డ్స్ టెస్టులో ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టుపై ఘన విజయం సాధించింది. దీంతో 5 టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. 372 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ టీం.. కేవలం 327 పరుగులకే ఆలౌటైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..