నీ బ్యాటింగ్‌లో దమ్ము లేదు.. విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలంటూ సలహా.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే?

|

Aug 13, 2021 | 8:17 PM

ఈ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చాలా దూకుడుగా ఆడతాడని, అయితే తప్పుడు షాట్లను సెలక్ట్ చేసుకుని తన ఇన్నింగ్స్‌ను ముగించాడని ఓ దిగ్గజ ఆటగాడు విమర్శలు గుప్పించాడు.

నీ బ్యాటింగ్‌లో దమ్ము లేదు.. విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలంటూ సలహా.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే?
Kevin Pietersen
Follow us on

ఇంగ్లండ్ ఓపెనర్ టామ్ బాంటన్‌పై ఓ ఆటగాడు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాడు. ఆ ఆటగాడు ముందు నుంచి చాలా దూకుడుతో ఆడతాడని, కానీ, రాంగ్ షాట్లను ఎంచుకుని తన ఇన్నింగ్స్‌ను త్వరగా ముగించాడని చెప్పుకొచ్చాడు. అలాగే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని చూసి నేర్చుకుంటే బాగుండేదంటూ ఓ సలహా కూడా ఇచ్చాడు. అలా అన్నది ఎవరో కాదు.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్. టామ్ బాంటన్‌పై ఇంగ్లీష్ మాజీ కెప్టెన్ నిప్పులు చెరుగుతున్నాడు. బాంటన్ బ్యాటింగ్ కారణంగా ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టులోకి వచ్చాడు. అలాగే పాజిటివ్ క్రికెట్ ఆడటానికి కూడా చాలా ప్రసిద్ధి చెందాడు. హండ్రెడ్ టోర్నమెంట్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతోంది. ఇందులో బెంటన్ మంచి ప్రారంభం తర్వాత చెడ్డ షాట్ ఆడడంతో తన వికెట్ కోల్పోయినట్లు పీటర్సన్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ నుంచి క్రికెట్ ఆడడం నేర్చుకోవాలని పీటర్సన్ సలహా ఇచ్చాడు.

ది హండ్రెడ్‌లో, బెంటన్ వెల్ష్ ఫైర్‌తో ఆడుతున్నాడు. కొన్ని మ్యాచ్‌లలో అతను మంచి ఆరంభాన్ని అందించినా… వాటిని భారీ స్కోర్లుగా నమోదు చేయలేకపోతున్నాడు. ది హండ్రెడ్‌లో చివరి ఐదు మ్యాచ్‌లలో ఈ 22 ఏళ్ల బెంటన్ 36, 0, 5, 2, 15 పరుగులు సాధించాడు. స్కై స్పోర్ట్స్‌తో పీటర్సన్ మాట్లాడుతూ, ‘బెంటన్ చాలా ప్రతిభ కలిగిన క్రికెటర్. కానీ ప్రస్తుతం అతను తన ప్రతిభను వృధా చేస్తున్నాడు. షాట్ల ఎంపికలో అతను అజాగ్రత్తగా ఉంటున్నాడు. ఎక్స్‌ట్రా కవర్, మిడ్ వికెట్‌‌పై వేగంగా ఆడాలి. లోపం ఎక్కడ ఉందో తెలుసుకుంటే మంచిది’ అంటూ చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లీ నుంచి నేర్చుకో..
విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ బ్యాటింగ్‌ను చూడమని బెంటన్‌ని కోరాడు. బెంటన్ తన ప్రతిభను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. ‘ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ల ఆటను చూడాలి. క్రీజులోకి రాగానే గాలిలోకి బాల్స్‌ను కొడితే త్వరగానే పెవిలియన్ చేరుతారు. విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ – వారి ఇన్నింగ్స్ ప్రారంభంలో ఎలా ఆడతారో చూడండి. కోహ్లీ తన ఇన్నింగ్స్ ప్రారంభంలో సిక్సర్లు కొట్టడం మీరు చూశారా? వీరిద్దరు చాలా జాగ్రత్తగా ఆడుతూ క్రీజులో కుదురుకున్నాక బ్యాట్ ఝులిపిస్తారు. బంతిని గాల్లోకి కాకుండా నేలపై ఆడాలంటూ’ సూచించాడు.

Also Read:

IND vs ENG: రెండో రోజు రాణించిన ఇంగ్లండ్ బౌలర్లు.. 364 పరుగులకు భారత్ ఆలౌట్..!

13 బంతులు.. 400 స్ట్రైక్ రేట్‌‌తో బ్యాటింగ్.. బౌలర్లకు దడ పుట్టించిన బ్యాట్స్‌మెన్.. క్రికెట్ లీగ్‌లో ఓ జట్టు ప్రపంచ రికార్డు.. ఎక్కడంటే?

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఓటమి.. ఒకేరోజు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ ఆటగాళ్లు.. వారెవరంటే?