కపిల్ దేవ్, సచిన్ లాంటి తోపు ఈ ప్లేయర్.. 10 వేలకుపైగా పరుగులు, 1697 వికెట్లు.. ఎవరంటే.?

|

May 23, 2024 | 7:50 PM

సచిన్, అలెన్ బోర్డర్, వివిన్ రిచర్డ్స్.. లాంటి దిగ్గజాలకు సాటి ఈ క్రికెటర్. 10 వేలకుపైగా పరుగులు చేశాడు, 1697 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. ఎన్నో అమోఘమైన రికార్డులు.. అంతకంటే ఎక్కువ ట్రోఫీలను కొల్లగొట్టాడు. ఆ వివరాలు..

కపిల్ దేవ్, సచిన్ లాంటి తోపు ఈ ప్లేయర్.. 10 వేలకుపైగా పరుగులు, 1697 వికెట్లు.. ఎవరంటే.?
Representative Image
Follow us on

సచిన్, అలెన్ బోర్డర్, వివిన్ రిచర్డ్స్.. లాంటి దిగ్గజాలకు సాటి ఈ క్రికెటర్. 10 వేలకుపైగా పరుగులు చేశాడు, 1697 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. ఎన్నో అమోఘమైన రికార్డులు.. అంతకంటే ఎక్కువ ట్రోఫీలను కొల్లగొట్టాడు. అనూహ్యంగా 1967వ సంవత్సరం ఆగష్టు 4న మరణించాడు. అతడెవరని అనుకుంటున్నారా.? మరెవరో కాదు ఇంగ్లాండ్ క్రికెటర్ పీటర్ స్మిత్. మరి అతడి రికార్డుల గురించి ఓసారి పరిశీలిస్తే.. వాస్తవానికి, పీటర్ స్మిత్ ఇంగ్లాండ్ తరపున కేవలం 4 టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మాత్రం అదరగొట్టాడు. రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు.

అంతేకాకుండా ఓ ఆసక్తికరమైన విషయమేంటంటే.. 1933 సంవత్సరంలో టెస్ట్ మ్యాచ్‌లో ఎంపికైనట్లు ఎవరో తప్పుడు సమాచారాన్ని పీటర్ స్మిత్‌కు అందించారు. అయితే అనూహ్యంగా ఈ మెసేజ్ అందిన 13 ఏళ్ల తర్వాత పీటర్ స్మిత్ ఇంగ్లాండ్ తరపున అరంగేట్రం చేశాడు. అతడు నాలుగు టెస్టులు ఆడి కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

ఇక పీటర్ స్మిత్ ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల విషయానికొస్తే, గణాంకాలు అద్భుతమని చెప్పొచ్చు. మొత్తం 465 మ్యాచ్‌ల్లో 17.95 సగటుతో 10,142 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 163 పరుగులు. అటు బౌలింగ్ విషయానికి వస్తే.. ఏకంగా 1697 వికెట్లు తీశాడు. ఇందులో 122 సార్లు ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు.