ఒకే మ్యాచ్‌లో అన్నదమ్ముల విధ్వంసం.. ఒకరు అర్ధ శతకం, మరొకరు డబుల్ సెంచరీ.. ఇంతకీ ఆ ప్లేయర్స్ ఎవరంటే.!

| Edited By: Anil kumar poka

Sep 23, 2021 | 5:17 PM

England County Championship: ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కౌంటీ ఛాంపియన్‌షిప్ జరుగుతోంది. ఈ టోర్నమెంట్‌లో ఎంతోమంది ప్లేయర్స్ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. తాజాగా..

ఒకే మ్యాచ్‌లో అన్నదమ్ముల విధ్వంసం.. ఒకరు అర్ధ శతకం, మరొకరు డబుల్ సెంచరీ.. ఇంతకీ ఆ ప్లేయర్స్ ఎవరంటే.!
Cooke
Follow us on

ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కౌంటీ ఛాంపియన్‌షిప్ జరుగుతోంది. ఈ టోర్నమెంట్‌లో ఎంతోమంది ప్లేయర్స్ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. తాజాగా గ్లామోర్గాన్, సర్రే మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అన్నదమ్ములు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. ఒకరు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అర్ధ సెంచరీతో అదరగొట్టగా.. మరొకరు ఆరో నెంబర్‌లో క్రీజులోకి వచ్చి డబుల్ సెంచరీ చేశాడు. వీరిద్దరూ కూడా గ్లామోర్గాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక వీళ్ల విధ్వంసానికి ఆ జట్టు ఏకంగా 672 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. ఆ బ్యాట్స్‌మెన్లు ఎవరో కాదు జో కుక్, క్రిస్ కుక్. ఆ మ్యాచ్ వివరాలు ఇలా ఉన్నాయి..

జో కుక్ అర్ధ సెంచరీతో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పగా.. క్రిస్ కుక్ మాత్రం భారీ ఇన్నింగ్స్‌తో కెప్టెన్‌గా తన బాధ్యతను నిర్వర్తించాడు. ఆరో స్థానంలో వచ్చిన క్రిస్ కుక్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. గ్లామోర్గన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న క్రిస్ కుక్.. 355 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి 299 బంతులు ఎదుర్కుని 205 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. అంతేకాకుండా క్రిస్ కుక్‌కు ఇదే ఫస్ట్ డబుల్ సెంచరీ.

క్రిస్ కుక్, కీరన్ కార్ల్సన్ మొదటి రోజు ఆట ముగిసేవరకు అజేయంగా నిలిచారు. దీనితో గ్లామోర్గాన్ మొదటి రోజు నాలుగు వికెట్ల నష్టానికి 379 పరుగులతో ముగించింది. కార్ల్‌సెన్ రెండో రోజు అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని.. 69 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డాన్ డౌంట్‌వైట్.. క్రిస్ కుక్‌కు చక్కటి సహకారాన్ని అందించాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 189 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డాన్ 146 బంతుల్లో 59 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టేలర్ 51 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 38 పరుగులు చేయగా.. క్రిస్ తన డబుల్ సెంచరీని 297 బంతుల్లో పూర్తి చేశాడు. కెప్టెన్ తన మొదటి డబుల్ సెంచరీని అందుకోగానే గ్లామోర్గాన్ ఇన్నింగ్స్‌ను 672 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇదిలా ఉంటే గ్లామోర్గన్ జట్టులో డేవిడ్ లాయిడ్(121), జో కుక్(68), బ్రూమ్(45)లు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టుకు భారీ స్కోర్ అందించడంలో సహాయపడ్డారు. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన సర్రే రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. జామీ స్మిత్(23), రయాన్ పటేల్(22) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. సర్రే ఇంకా 627 పరుగులు వెనుకబడి ఉంది.

Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!