ENG vs SA: 16 బంతుల్లో హాఫ్ సెంచరీ.. బౌండరీలతో ప్రత్యర్ధులకు దబిడ దిబిడే.. ధోని టీం మేట్ స్ట్రైక్‌రేట్ చూస్తే వణుకే..

|

Jul 28, 2022 | 9:55 AM

ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ జానీ బెయిర్‌స్టో, మొయిన్‌ అలీ ఒక్క ఓవర్‌లో పరుగుల సునామీ సృష్టించారు. సిక్సర్ల వర్షం కురిపించి దక్షిణాఫ్రికా శిబిరాన్ని చీల్చి చెండాడారు.

ENG vs SA: 16 బంతుల్లో హాఫ్ సెంచరీ.. బౌండరీలతో ప్రత్యర్ధులకు దబిడ దిబిడే.. ధోని టీం మేట్ స్ట్రైక్‌రేట్ చూస్తే  వణుకే..
Eng Vs Sa Englnd Players Moeen Ali And Jonny Bairstow Vs South Africa
Follow us on

టీ20 క్రికెట్ అంటే బ్యాట్‌కి, బంతికి మధ్య పోరని తెలిసిందే. ఇందుకు బ్రిస్టల్‌లో ఇంగ్లండ్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన తొలి టీ20 చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. ఇంగ్లండ్‌కు చెందిన ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు – జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ కేవలం ఒకే ఓవర్‌లో పరుగుల సునామీని సృష్టించారు. సిక్సర్ల వర్షం కురిపించి విధ్వంసం చేశారు. దక్షిణాఫ్రికా శిబిరంలో సందడి నెలకొంది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌‌లో జరిగిన బీభత్సం చూస్తే.. బౌలర్లకు బౌలింగ్‌పైనే ఆసక్తిని పోయేలా చేశారంటూ నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు.

టీ20 క్రికెట్‌లో బౌలర్లు బలవ్వడం మనం చానాసార్లు చూసే ఉంటాం. ఒక ఓవర్‌లో సిక్స్‌లు, ఫోర్ల వర్షం కురినిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే, టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఏ దక్షిణాఫ్రికా బౌలర్ పేరిట నెలకొన్న చెత్త రికార్డ్ ఇదే కావడం గమనార్హం. దక్షిణాఫ్రికా బౌలర్ ఫెలుక్వాయో వేసిన ఒక ఓవర్‌లో బెయిర్‌స్టో, మొయిన్ అలీ 5 సిక్సర్లతో పాటు మొత్తం 33 పరుగులు పిండుకున్నారు.

భారమైన 17వ ఓవర్..

ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ వేయడానికి వచ్చిన దక్షిణాఫ్రికా బౌలర్‌ ఫెలుక్వాయోపై జానీ బెయిర్‌స్టో దాడిని ప్రారంభించి, మొయిన్ అలీ చేత అమలు చేయించాడు. ఈ ధాటికి స్టేడియం బయట పార్క్ చేసిన కార్లు కూడా కొంత దెబ్బతిన్నాయి. బెయిర్‌స్టో, మొయిన్ అలీ చేతుల్లో ఫెలుక్వాయో ఘోర పరాజయాన్ని అందుకున్నాడు.

కారును దెబ్బతీసిన రెండో సిక్సర్..

ఫెలుక్వాయో వేసిన తొలి బంతికే జానీ బెయిర్‌స్టో స్ట్రైక్ చేశాడు. లెగ్ సైడ్ లో సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత రెండో బంతికి మళ్లీ సిక్సర్‌ బాదాడు. అయితే ఈసారి సిక్స్ కాస్త పొడవుగా ఉండడంతోపాటు హానికరంగా కూడా మారింది. డీప్ మిడ్‌వికెట్‌ నుంచి కొట్టిన బెయిర్‌స్టో సిక్స్.. ఒకరి కారుపై పడటంతోపాటు స్వల్పంగా గీతలు పడేలా చేసింది.