England Vs South Africa: రెండో టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్ తనదైన శైలిలో రాణించడంతో ఇంగ్లండ్ జట్టు దక్షిణాఫ్రికాకు ధీటుగా సమాధానం ఇచ్చింది. ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మాంచెస్టర్‌లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌ను ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ రెండు మ్యాచ్‌లు 3 రోజుల్లో ముగిసిపోవడం విశేషం.
ఘోరంగా విఫలమైన దక్షిణాఫ్రికా బౌలర్లు..
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనికి సమాధానంగా ఇంగ్లిష్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 415 పరుగులు చేసి డిక్లేర్ చేసి విజిటింగ్ టీమ్‌పై ఒత్తిడి తెచ్చింది. దక్షిణాఫ్రికా జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో కూడా కోలుకోలేదు. రెండో ఇన్నింగ్స్‌లో 179 పరుగులకు ఆలౌటైంది.
ఆకట్టుకోని దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్స్..
రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఆకట్టుకోలేకపోయారు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కగిసో రబాడ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు తరపున అత్యధికంగా 36 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కీగన్ పీటర్సన్ అత్యధికంగా 42 పరుగులు చేశాడు. అతనికి తోడు రాసి వాన్ డెర్ డుసాన్ 41 పరుగులు చేశాడు. ఇంగ్లిష్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ముందు దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ నిలవలేకపోయారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 8 మంది దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ 15 పరుగులు మాత్రమే చేయగలిగారు.
A 14 over spell ?
14-3-30-2 ?
Ben Stokes ???????? #ENGvSA ?? pic.twitter.com/OW1zTYFNDj
— England Cricket (@englandcricket) August 27, 2022
The moment we levelled the Test series! ?
??????? #ENGvSA ?? pic.twitter.com/FKC7QHoZ0T
— England Cricket (@englandcricket) August 27, 2022
బెన్ స్టోక్స్, బెన్ ఫాక్స్ ఆధిపత్యం..
అదే సమయంలో, మాంచెస్టర్ టెస్టులో బెన్ స్టోక్స్, బెన్ ఫాక్స్ ఆధిపత్యం చెలాయించారు. ఇద్దరూ సెంచరీలు సాధించారు. కెప్టెన్ స్టోక్స్ 163 బంతుల్లో 103 పరుగులు చేయగా, ఫాక్స్ 217 బంతుల్లో 113 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ స్టోక్స్ సత్తా చాటాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 4 వికెట్లు తీశాడు. అదే సమయంలో ఇంగ్లిష్ బౌలర్ జేమ్స్ అండర్సన్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 6 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఫ్లాప్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగులు చేశాడు.