Unwanted Record: దిగ్గజాలకే వణుకు పుట్టించాడు.. కట్‌చేస్తే.. పంజాబ్ కింగ్స్ బ్యాటర్ దెబ్బకు చెత్త రికార్డ్‌లో స్టార్ బౌలర్

|

Sep 28, 2024 | 9:25 AM

Mitchell Starc Unwanted Record in Eng vs Aus 4th ODI: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ప్రపంచంలోని ప్రమాదకరమైన బౌలర్లలో ఒకటిగా పేరుగాంచాడు. మిచెల్ స్టార్క్ తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆస్ట్రేలియాకు ఎన్నో మ్యాచ్‌లు గెలిచాడు. అయితే, శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ మిచెల్ స్టార్క్‌కు అంత మంచిది కాదని నిరూపితమైంది.

Unwanted Record: దిగ్గజాలకే వణుకు పుట్టించాడు.. కట్‌చేస్తే.. పంజాబ్ కింగ్స్ బ్యాటర్ దెబ్బకు చెత్త రికార్డ్‌లో స్టార్ బౌలర్
Mitchell Starc Unwanted Record
Follow us on

Mitchell Starc Unwanted Record in Eng vs Aus 4th ODI: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ప్రపంచంలోని ప్రమాదకరమైన బౌలర్లలో ఒకటిగా పేరుగాంచాడు. మిచెల్ స్టార్క్ తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆస్ట్రేలియాకు ఎన్నో మ్యాచ్‌లు గెలిచాడు. అయితే, శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ మిచెల్ స్టార్క్‌కు అంత మంచిది కాదని నిరూపితమైంది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ మిచెల్ స్టార్క్‌పై ఒకే ఓవర్‌లో 28 పరుగులు పిండుకున్నాడు. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో అవాంఛిత రికార్డు కూడా స్టార్క్ పేరిట నమోదైంది.

లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య నాలుగో వన్డే మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 39-39 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 39 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరపున బెన్ డకెట్, కెప్టెన్ హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్ చాలా బాగా బ్యాటింగ్ చేశారు. బెన్ డకెట్ 62 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 63 పరుగులు చేశాడు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్ 58 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 87 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

మిచెల్ స్టార్క్ వేసిన ఒకే ఓవర్‌లో 4 సిక్సర్లు బాదిన లియామ్ లివింగ్‌స్టోన్..

లియామ్ లివింగ్‌స్టోన్ అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేశాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయంగా 62 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ సమయంలో, మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియాకు చివరి ఓవర్ బౌల్ చేశాడు. ఆ ఓవర్‌లో, లియామ్ లివింగ్‌స్టోన్ ఒకే ఓవర్‌లో 28 పరుగులు చేశాడు. ఈ ఓవర్‌లో లివింగ్‌స్టోన్ 4 సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా వన్డే చరిత్రలో ఒక ఓవర్‌లో 28 పరుగులు ఇచ్చిన తొలి బౌలర్‌గా మిచెల్ స్టార్క్ నిలిచాడు. స్టార్క్ తన 8 ఓవర్ల స్పెల్‌లో 70 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

ఆస్ట్రేలియా అత్యుత్తమ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఒకడిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. కంగారూ జట్టు అతనిపై చాలా ఆధారపడి ఉంది. కానీ, వీలైనంత త్వరగా ఈ మ్యాచ్‌ను మరచిపోవాలనుకుంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..