ENG vs AFG: చెత్త రికార్డుల్లో చేరిన డిఫెండింగ్ ఛాంపియన్.. ఆఫ్ఘాన్ దెబ్బకు ప్రపంచంలోనే తొలి జట్టుగా..

World Cup 2023: ప్రస్తుత ప్రపంచకప్ సీజన్‌లో ఇంగ్లండ్ 3 మ్యాచ్‌లు ఆడగా, 2 మ్యాచ్‌ల్లో ఓడింది. ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ ఓడించింది. ఇంగ్లండ్‌ తమ రెండో మ్యాచ్‌లో గెలుపొందింది. అయితే నిన్న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఓటమి ఆటగాళ్లకు తీవ్ర గాయాన్ని మిగిల్చింది. ఇంగ్లండ్ జట్టు 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఇంగ్లండ్ సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే ఇకపై వరుసగా మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.

ENG vs AFG: చెత్త రికార్డుల్లో చేరిన డిఫెండింగ్ ఛాంపియన్.. ఆఫ్ఘాన్ దెబ్బకు ప్రపంచంలోనే తొలి జట్టుగా..
England

Updated on: Oct 16, 2023 | 12:09 PM

England shameful World Cup Record: 2019 ప్రపంచ ఛాంపియన్ టీమ్ ఇంగ్లండ్ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఓటమితో ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది. ప్రపంచంలోనే చెత్త జట్టుగా అవతరించింది. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన 13వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో ఓడించిన అఫ్గానిస్థాన్ టీం.. వరల్డ్ కప్‌లో పెను సంచలనం సృష్టించింది. దీంతో క్రికెట్‌లో అత్యంత అవమానకరమైన రికార్డుల్లో ఇంగ్లండ్ పేరును చేర్చింది.

ఈ విషయంలో చెత్త జట్టుగా ఇంగ్లండ్..

ఆదివారం (అక్టోబర్ 15, 2023) ఇంగ్లాండ్‌కు మరపురాని రోజుగా మారింది. ఈ మ్యాచ్‌లో తొలుత ఆఫ్ఘనిస్థాన్ జట్టుపై 69 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత అవమానకరమైన రికార్డు కూడా తన పేరిటే నమోదు చేసుకుంది. ప్రపంచకప్ చరిత్రలో 11వ జట్టుపై ఇంగ్లండ్ ఓటమి చవిచూసింది. ఇంతకు ముందు ఈ టోర్నీలో ఏ జట్టు కూడా ఈ చెత్త రికార్డులో చేరలేదు. ప్రపంచకప్‌లో ఐసీసీ టాప్-8 జట్లలో ఇదే చెత్త ప్రదర్శన. ఈ చెత్త రికార్డు పరంగా ఇంగ్లండ్ నంబర్-1 స్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి

2023 ప్రపంచకప్‌లో రెండో ఓటమి..

ప్రస్తుత ప్రపంచకప్ సీజన్‌లో ఇంగ్లండ్ 3 మ్యాచ్‌లు ఆడగా, 2 మ్యాచ్‌ల్లో ఓడింది. ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ ఓడించింది. ఇంగ్లండ్‌ తమ రెండో మ్యాచ్‌లో గెలుపొందింది. అయితే నిన్న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఓటమి ఆటగాళ్లకు తీవ్ర గాయాన్ని మిగిల్చింది. ఇంగ్లండ్ జట్టు 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఇంగ్లండ్ సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే ఇకపై వరుసగా మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.

ఒక్కడే అర్ధశతకం..

2019 ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచిన ఇంగ్లండ్‌ అఫ్ఘానిస్థాన్‌ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. తొలుత ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్ అద్భుత ప్రదర్శన చేశారు. ఆ తర్వాత బౌలర్లు ఇంగ్లండ్ జట్టును విజయానికి దూరం చేశారు. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 40.3 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ తరపున హ్యారీ బ్రూక్ (66) అత్యధిక పరుగులు చేశాడు. కాగా, డేవిడ్ మలాన్ 32 పరుగులు జోడించాడు. ఇది కాకుండా ఏ బ్యాట్స్‌మెన్ కూడా భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాడు.

రెండు జట్లు..

ఇంగ్లండ్ జట్టు: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ.

ఆఫ్ఘనిస్థాన్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మత్ షాహిదీ (కెప్టెన్), మహ్మద్ నబీ, అజ్మత్ ఒమర్జాయ్, ఇక్రమ్ అలీ ఖిల్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహమాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్ ఫరూఖీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..