Video: 0,W,4,0,W,0.. ఒకే ఓవర్లో 2 వికెట్లతో చెలరేగిన బుడ్డోడు.. సెలబ్రేషన్స్ చూస్తే ఫిదానే..!

Vaibhav Sooryavanshi Turns Bowler, Bags 2 Wickets In 4 Balls: వైభవ్ సూర్యవంశీ దులీప్ ట్రోఫీలో నార్త్ ఈస్ట్ జోన్‌పై అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా, ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే, బ్యాటింగ్ లో విఫలమైన వైభవ్.. బాల్ తో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో బ్యాటర్ నుంచి ఆల్ రౌండర్ గా మారిన బుడ్డోడిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Video: 0,W,4,0,W,0.. ఒకే ఓవర్లో 2 వికెట్లతో చెలరేగిన బుడ్డోడు.. సెలబ్రేషన్స్ చూస్తే ఫిదానే..!
Vaibhav Sooryavanshi Turns Bowler, Bags 2 Wickets In 4 Balls

Updated on: Aug 25, 2026 | 2:41 PM

Vaibhav Sooryavanshi Turns Bowler, Bags 2 Wickets In 4 Balls: భారీ సిక్సర్లతో బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం తన బౌలింగ్ తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా వైభవ్, బ్యాటింగ్ లో తుస్సుమన్నాడు. కానీ, నార్త్ ఈస్ట్ జోన్‌పై తన స్పిన్ బౌలింగ్‌తో చెలరేగి ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో బుడ్డోడు బ్యాటింగ్ లోనే కాదు, బౌలింగ్, ఫీల్డింగ్ లోనూ ఆరితేరిపోయాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో ఈస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జరిగింది. ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ 28వ ఓవర్లో బాల్ తీసుకున్నాడు. ఇదే ఓవర్లో తన రెండో బంతికి లింగ్డోను, ఆ తర్వాత 5వ బంతికి లెమ్టూర్ ను పెవిలియన్ చేర్చాడు. ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీసిన తర్వాత బుడ్డోడి సెలబ్రేషన్ తప్పక చూడాల్సిందే.

బ్యాటింగ్ లో తేలిపోయిన వైభవ్..

వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం ఆరు బంతులు ఆడిన వైభవ్ 2 ఫోర్లతో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

భారీ విజయం దిశగా ఈస్ట్ జోన్..

మొదట బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్, తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగులు చేసింది. అనంతంర నార్త్ ఈస్ట్ జోన్ ను కేవలం 111 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈస్ట్ జోన్ బౌలర్లలో త్రిపుర మీడియం పేసర్ అభిజిత్ సర్కార్ 9.5 ఓవర్లలో 20 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా, షాబాజ్ 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఫాలో-ఆన్ ఆడిన నార్త్ ఈస్ట్ జోన్ 146 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఈస్ట్ జోన్ టీం ఇన్నింగ్ 210 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us