Siraj-Head Controversy: పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలోనూ అగ్రస్థానం సాధించింది. మరోవైపు అడిలైడ్ ఓటమితో టీమిండియాకు బిగ్ షాక్ తగలింది. డబ్ల్యూటసీలో అగ్రస్థానం నుంచి మూడవ స్థానానికి దిగజారిపోయింది. ఈ క్రమంలో ఓ విషయం సోషల్ మీడియాలో ఎక్కువగా వైరలవుతోంది. అదే ట్రావిస్ హెడ్, మహ్మద్ సిరాజ్ వాగ్వాదం. అడిలైడ్ టెస్ట్ రెండో రోజు సిరాజ్ హెడ్‌ని క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇద్దరు ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీనిపై హెడ్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. సిరాజ్‌ను వెల్ బాల్ అంటూ పిలిచాడు. అయితే సిరాజ్ అందుకు అంగీకరించలేదు.
అడిలైడ్ గ్రౌండ్‌లో మూడో రోజు మ్యాచ్ ప్రారంభానికి ముందు, హర్భజన్ సింగ్‌తో మాట్లాడిన సిరాజ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ‘హెడ్ ఏం మాట్లాడారో మీరు టీవీలో చూడొచ్చు. వెల్ బాల్ అని మీడియా సమావేశంలో తప్పుగా మాట్లాడాడు. అందరినీ గౌరవిస్తాం. క్రికెట్ ఒక పెద్దమనుషుల ఆట. ఆయన మాట్లాడిన తీరుకు నేనూ అలాగే రియాక్ట్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు.
Stunning revelation! @mdsirajofficial breaks his silence on his verbal clash with #TravisHead during Day 2 of the pink-ball Test! 😳
PS. Don’t miss @harbhajan_singh‘s advice to DSP Sahab! 🫣#AUSvINDOnStar 2nd Test, Day 3 👉 LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy… pic.twitter.com/x0IqMVG1Ir
— Star Sports (@StarSportsIndia) December 8, 2024
దీనికి హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. సిరాజ్.. నువ్వు హైదరాబాద్ డీఎస్పీవి. ఐపీఎల్ ఆడేందుకు హైదరాబాద్ వచ్చినప్పుడు ట్రావిస్ మెడ్‌ని జైల్లో పెట్టండి అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. దీంతో సిరాజ్, హర్భజన్ సింగ్‌లు నవ్వడం మొదలుపెట్టారు.
సిరాజ్ గురించి మాట్లాడితే, అతను ICC T20 వరల్డ్ కప్ 2024 టైటిల్ గెలుచుకున్న జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సిరాజ్‌కు హైదరాబాద్‌లో డీఎస్పీగా బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి అభిమానులంతా సిరాజ్‌ని డీఎస్పీ సిరాజ్ అంటూ పిలవడం ప్రారంభించారు. ఇక మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 180 పరుగులకే పరిమితమైంది. ట్రావిస్ హెడ్ (140) రాణించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసి 157 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 175 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో కేవలం 19 పరుగుల టార్గెట్ పొందిన ఆస్ట్రేలియా.. వికెట్ నష్టపోకుండా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..