Video: ఇలాంటి రనౌట్ ఇప్పటి వరకు చూసుండరు.. పట్టరాని కోపంతో బంతిని కాలితో తంతే..!

Himmat Singh Frustrated Kick Sparks Freak Run-out: క్రికెట్‌లో చివరి బంతి వరకు ఏమైనా జరగొచ్చనే నిజాన్ని ఈ విచిత్ర రన్‌అవుట్ మరోసారి నిరూపించింది. మ్యాచ్ ఓడిపోయినా, హిమ్మత్ సింగ్ సాధించిన ఈ అనుకోని రన్‌అవుట్ డీపీఎల్ చరిత్రలోనే ఒక మర్చిపోలేని మలుపుగా మిగిలిపోయింది.

Video: ఇలాంటి రనౌట్ ఇప్పటి వరకు చూసుండరు.. పట్టరాని కోపంతో బంతిని కాలితో తంతే..!
Himmat Singh Frustrated Kick Sparks Freak Run Out Video

Updated on: Aug 05, 2026 | 7:47 AM

Himmat Singh Frustrated Kick Sparks Freak Run-out: ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఊహకందని అద్భుతం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ టైగర్స్ కెప్టెన్ హిమ్మత్ సింగ్ చేసిన ఒక చిన్న పొరపాటు, ఆ తర్వాత కోపంతో బంతిని కాలితో తన్నడం చివరికి ఒక సంచలన రన్‌అవుట్‌గా మారింది. ఆఖరి బంతికి విజయానికి ఒక్క పరుగు కావాల్సిన సమయంలో జరిగిన ఈ విచిత్ర ఘట్టం మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు దారితీసింది.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా అవుటర్ ఢిల్లీ వారియర్స్, న్యూఢిల్లీ టైగర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించింది. వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ పోరులో అవుటర్ ఢిల్లీ వారియర్స్ జెట్టుకు చివరి బంతికి గెలిచేందుకు ఒక్క పరుగు మాత్రమే అవసరమైంది. క్రిజ్‌లో ఉన్న బ్యాటర్ ప్రథమ్ సలూజా బంతిని ముందుకు నెట్టి పరుగు కోసం పరిగెత్తాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న న్యూఢిల్లీ టైగర్స్ కెప్టెన్ హిమ్మత్ సింగ్ వైపు బంతి వేగంగా వెళ్లింది. అయితే హిమ్మత్ ఆ సులువైన బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. రన్ అవుట్ చేసే సువర్ణావకాశం చేజారిపోవడంతో జట్టు ఓటమి ఖాయమని భావించిన సహచర ఆటగాళ్లు తలలు పట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Video: ఓరేయ్ ఆజామూ.. మరోసారి నవ్వులపాలైన పాక్ టీమ్.. వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..!

కోపంతో కాలితో తన్నితే.. సీన్ రివర్స్..!

చేతికి వచ్చిన విజయాన్ని చేజార్చుకున్నాననే తీవ్ర నిరాశ, ఆవేశంలో హిమ్మత్ సింగ్ బంతిని కాలితో బలంగా తన్నాడు. అక్కడే అసలైన డ్రామా మొదలైంది. ఆయన తన్నిన బంతి సరిగ్గా నాన్ స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్లను బలంగా తాకింది. ఆ సమయంలో బ్యాటర్ ప్రథమ్ సలూజా ఇంకా క్రిజ్‌లోకి చేరుకోలేదు. దీంతో అంపైర్ రన్‌అవుట్‌గా ప్రకటించడంతో మ్యాచ్ ఒక్కసారిగా సమమైంది. తానెంత కోపంతో ఉన్నానో, బంతి వికెట్లను తాకగానే అంత తీవ్రమైన ఆనందంలోకి మునిగిపోయాడు హిమ్మత్. మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విచిత్ర రన్‌అవుట్ చూసి నోరెళ్లబెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

సూపర్ ఓవర్ డ్రామా.. గెలుపు ఎవరిదంటే..?

చివరి బంతి రన్‌అవుట్‌తో మ్యాచ్ టై కావడంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు. నాటకీయ పరిణామాల మధ్య సూపర్ ఓవర్ వరకు వచ్చిన అవుటర్ ఢిల్లీ వారియర్స్ జట్టు ఆ తర్వాత ఒత్తిడిని జయించి విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన అవుటర్ ఢిల్లీ 20 పరుగులు సాధించగా, ఛేదనలో న్యూఢిల్లీ టైగర్స్ తడబడి ఓటమి పాలైంది. మ్యాచ్ ఫలితం అవుటర్ ఢిల్లీకి అనుకూలంగా వచ్చినప్పటికీ, లీగ్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయంగా మిగిలిపోయిన హిమ్మత్ సింగ్ విచిత్ర రన్‌అవుట్ గురించి మాత్రమే నెటిజన్లు, క్రికెట్ ప్రేమికులు విశేషంగా చర్చించుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: 132 ఫోర్లు, 168 సిక్స్‌లతో 1670 పరుగులు.. క్రిస్ గేల్‌కే మెంటలెక్కించేలా వైభవ్ విధ్వంసం..

ఐపీఎల్ స్టార్.. మైదానంలో అపూర్వ దృశ్యం..!

హిమ్మత్ సింగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. మిచెల్ మార్ష్ స్థానంలో ఐపీఎల్‌లోకి వచ్చిన ఆయన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ మంచి ప్రతిభ కనపరిచాడు. జులై 31 నుంచి ప్రారంభమైన ఈ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టోర్నీ ఆగస్టు 30 వరకు కొనసాగనుంది. టోర్నీ సాగుతున్న కొద్దీ ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరుగుతున్నప్పటికీ, హిమ్మత్ సింగ్ చేసిన ఈ విచిత్ర రన్‌అవుట్ డీపీఎల్ 2026 సీజన్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోవడం ఖాయం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us