
Virat Kohli 100 Centuries: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌కు రంగం సిద్ధమవుతోంది. నవంబర్ 4 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma), శుభ్‌మన్ గిల్ (Shubman Gill) వంటి స్టార్ క్రికెటర్లు అభిమానులను అలరించనున్నారు. 2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు ఈ సిరీస్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా భారత జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్న కోహ్లీ, రోహిత్ ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే 86 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ.. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) 100 సెంచరీల ప్రపంచ రికార్డును అందుకోవాలని చూస్తున్నాడు. కోహ్లీ ఈ ఘనత సాధిస్తే క్రికెట్ చరిత్రలో మరో ప్రత్యేక అధ్యాయం నమోదవుతుంది. అయితే న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ (Kyle Jamieson) మాత్రం ఈ విషయంపై సరదాగా స్పందించాడు.
Abhishek Sharma: 4 ఫోర్లు, 6 సిక్స్‌లు.. 15 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ!
కోహ్లీ 2027 ప్రపంచకప్ నాటికి 100 సెంచరీలు పూర్తి చేస్తాడా అని ప్రశ్నించగా.. ప్రస్తుత భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లోనే ఆ ఘనత సాధించే అవకాశం లేదని జేమీసన్ చిలిపిగా వ్యాఖ్యానించాడు.
కోహ్లీ సామర్థ్యంపై మాత్రం జేమీసన్ ప్రశంసలు కురిపించాడు. అతను ప్రపంచ స్థాయి ప్రతిభ కలిగిన ఆటగాడని, అతని నైపుణ్యం, ఫిట్‌నెస్ స్థాయిని చూస్తే ఇంకా చాలా సంవత్సరాలు క్రికెట్ ఆడగలడని చెప్పాడు. భారత్ జెర్సీ వేసుకున్నా, ఆర్‌సీబీ జెర్సీ ధరించినా కోహ్లీ తన అత్యుత్తమ స్థాయిలోనే ఉంటాడని పేర్కొన్నాడు.
కైల్ జేమీసన్‌కు భారత జట్టుతో ప్రత్యేక అనుభవం ఉంది. వన్డే, టెస్టు క్రికెట్‌లో అతని అంతర్జాతీయ అరంగేట్రం భారత్‌పైనే జరిగింది. ఇప్పటివరకు భారత్‌పై అన్ని ఫార్మాట్లలో జేమీసన్ 38 వికెట్లు సాధించాడు. ఇదే అతని కెరీర్‌లో ఒక దేశంపై అత్యధిక వికెట్ల సంఖ్య.
కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు కొట్టిన కాటేరమ్మ కొడుకు.. లిస్ట్‌లో తొలి ప్లేయర్‌గా నయా హిస్టరీ..!
మరోవైపు విరాట్ కోహ్లీని అంతర్జాతీయ క్రికెట్‌లో జేమీసన్ ఐదుసార్లు ఔట్ చేశాడు. దీంతో రాబోయే వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరి మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. కోహ్లీ 100 సెంచరీల లక్ష్యం దిశగా సాగుతుండగా.. అతన్ని అడ్డుకునేందుకు జేమీసన్ మరోసారి బంతితో సవాల్ విసరనున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..