BCCI: దేశీయ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను పెంచిన బీసీసీఐ.. ఎంత పొందనున్నారో తెలుసా?

దేశీయ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను పెంచాలని బోర్డు నిర్ణయించిందని బీసీసీఐ కార్యదర్శి జైషా సోమవారం ట్వీట్ చేశారు. ఎంత పెరిగాయంటే..

BCCI: దేశీయ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను పెంచిన బీసీసీఐ.. ఎంత పొందనున్నారో తెలుసా?
Bcci
Follow us

|

Updated on: Sep 20, 2021 | 4:51 PM

BCCI: దేశీయ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను పెంచాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయించింది. దేశీయ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను పెంచాలని బోర్డు నిర్ణయించిందని బోర్డు కార్యదర్శి జైషా సోమవారం ట్వీట్ చేశారు. 40 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన దేశీయ ఆటగాళ్లు ప్రస్తుతం రూ. 60,000 పొందుతారు. అలాగే 23 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆటగాళ్లకు రూ. 25,000, 19 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న క్రికెటర్లకు బోర్డు ద్వారా రూ .20,000 ఫీజుగా పొందనున్నారు.

2019-20 దేశీయ సీజన్‌లో పాల్గొనే క్రికెటర్లకు కరోనావైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే 2020-21 సీజన్‌లో వారికి పరిహారంగా అదనంగా 50 శాతం మ్యాచ్ ఫీజు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

జై షా ట్వీట్.. బోర్డ్ సెక్రటరీ జైషా తన ట్వీట్‌లో “దేశవాళీ క్రికెటర్ల కోసం మ్యాచ్ ఫీజుల పెంపును ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. సీనియర్స్- రూ. 60,000లు (40 మ్యాచ్‌ల పైన), 23 ఏళ్లలోపు లోపు- రూ. 25,000, 19 ఏల్ల లోపు- రూ. 20,000లు పొందుతారు” అని రాసుకొచ్చారు.

Also Read: Virat Kohli Lamborghini Car: అమ్మకానికి విరాట్ కోహ్లీ మాజీ కారు.. ధరెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

IPL 2021: ఐపీఎల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు.. అత్యధిక సార్లు గెలుచుకుంది వీరే..!

IPL 2021 RCB vs KKR Preview: ఆర్‌సీబీతో కేకేఆర్ పోరు.. కోహ్లీ టీంకు కోల్‌కత్తా పోటీ ఇవ్వగలదా.. గణాంకాలు ఏలా ఉన్నాయంటే?

IPL 2021: విరాట్‌ కోహ్లీ జట్టుకి మరొక ఫాస్ట్ బౌలర్ జత కలిసాడు..! వేగంతో పాటు బ్యాట్‌తో కూడా భయపెడుతున్నాడు..