Virat Kohli Lamborghini Car: అమ్మకానికి విరాట్ కోహ్లీ మాజీ కారు.. ధరెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
కొంతకాలం ఉపయోగించిన తర్వాత దానిని విక్రయించాడు. పుదుచ్చేరి రిజిస్టర్డ్ కారు ప్రస్తుతం కొచ్చిలోని ఓ ప్రీమియం, లగ్జరీ కార్ల డీలర్ అయిన రాయల్ డ్రైవ్‌లో..
Virat Kohli Lamborghini Car: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యంత ఖరీదైన మాజీ కారు ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా? అసలు దాని రేటు ఎంత ఉంటుందో తెలుసా? కార్లను ఇష్టపడే విరాట్ కోహ్లీ.. ఎన్నో ఖరీదైన కార్లను తన షెడ్‌లో ఉంచుకున్నాడు. అయితే ఆయన వాడిన ఓ మాజీ కారు ఆరెంజ్ కలర్ లంబోర్గిని గల్లార్డో స్పైడర్ ప్రస్తుతం కొచ్చిలో ఉందంట. ఓ లగ్జరీ కార్ షోరూమ్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. స్పోర్ట్స్ కార్లను బాగా ఇష‌్టపడే విరాట్ కోహ్లీ వాడిన కారు మీకు కావాలంటే మాత్రం దక్కించుకునే ఛాన్స్ కూడా ఉంది. మరి ఈ అద్భుత అవకాశాన్ని దక్కించుకునేందుకు ఎవరు ముందుకు వస్తారో చూడాలి. ఆటోమొబైల్ వెబ్‌సైట్ ఆధారంగా, కోహ్లీ ఈ లంబోర్గినిని 2015 లో కొనుగోలు చేశాడు.
కొంతకాలం ఉపయోగించిన తర్వాత దానిని విక్రయించాడు. పుదుచ్చేరి రిజిస్టర్డ్ కారు ప్రస్తుతం కొచ్చిలోని ఓ ప్రీమియం, లగ్జరీ కార్ల డీలర్ అయిన రాయల్ డ్రైవ్‌లో రూ .1.35 కోట్లకు అందుబాటులో ఉంది.
“ఇది 2013 మోడల్ లంబోర్గిని. విరాట్ కోహ్లీ చాలా స్వల్ప కాలమే దీన్ని =ఉపయోగించారు. ఇది కేవలం 10,000 కిమీ మాత్రమే నడిచింది ” అని రాయల్ డ్రైవ్ మార్కెటింగ్ మేనేజర్ చెప్పారు. “మేము ఈ ప్రముఖ కారును కోల్‌కతాకు చెందిన ప్రీమియం, లగ్జరీ ప్రివెన్డ్ కార్ డీలర్ నుంచి జనవరి 2021 లో కొనుగోలు చేసాము” అని ఆయన చెప్పారు.
ఈ మోడల్‌ను LP560-4 అని కూడా అంటారు. ఇది 5.2-లీటర్ నాచురల్ ఆస్పిరేటెడ్ V10 ఇంజిన్‌తో శక్తినిస్తుంది. ఇది గరిష్టంగా 560 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం నాలుగు సెకన్లలో గంటకు 0-100 కిమీల వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం గంటకు 324 కిలోమీటర్లకు చేరుకుంటుందని ఆయన తెలిపారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. గత వారం ఓ సంచలన వార్తను వెల్లడించి వార్తల్లో నిలిచాడు. టీ20 ప్రపంచ కప్ తరువాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇక అప్పటి నుంచి కోహ్లీ వారసుడు ఎవరంటూ చర్చలు మొదలయ్యాయి. ఇక తాజాగా మరో హాట్ న్యూస్‌తో విరాట్ కోహ్లీ మరోసారి వార్తల్లో నిలిచాడు
ఐపీఎల్ 2021 సీజన్ తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించాడు. ఈమేరకు ఆర్‌సీబీ తన సోషల్ మీడియాలో విరాట్ మాట్లుడుతున్న ఓ వీడియోను పంచుకుంది. ‘నా కెప్టెన్సీలో చివరి ఐపీఎల్. ప్లేయర్‌గా మాత్రం ఆర్‌సీబీలోనే కొనసాగుతాను. ఇంత వరకు అండగా నిలిచిన ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read: IPL 2021: ఐపీఎల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు.. అత్యధిక సార్లు గెలుచుకుంది వీరే..!