IPL 2022: IPL 2022లో దినేష్ కార్తీక్ పేరు మారుమోగుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతి మ్యాచ్‌లోనూ అతని పేరు ప్రతిధ్వనిస్తోంది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ 15 కోట్ల ఆటగాడికి తగిలింది. ఆ ఆటగాడు మరెవరో కాదు ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్. అయితే ఐపీఎల్‌లో దినేశ్ కార్తీక్ వల్ల ఇషాన్ కిషన్‌కి ఎటువంటి సమస్య లేదు. కానీ త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కి ఎంపికయ్యే విషయంలో పోటీ తప్పదు. ఎందుకంటే దినేష్ కార్తీక్ టీమిండియాలో చోటు సంపాదించడమే లక్ష్యంగా ఆడుతున్నాడు. కానీ ఈ విషయంలో ఇషాన్ కిషన్ వెనుకబడ్డాడని చెప్పవచ్చు.
IPL 2022లో దినేష్ కార్తీక్ VS ఇషాన్ కిషన్
ఐపీఎల్ 2022లో 6 మ్యాచ్‌లు ఆడిన దినేష్ కార్తీక్ 197 పరుగులు చేశాడు. RCB తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో అతను 5 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. మిగిలిన ఇన్నింగ్స్‌లు కూడా జట్టుకు ఉపయోగకరంగా ఉన్నాయి. మరోవైపు ఇషాన్ కిషన్. ఐపీఎల్ 2022లో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీలతో 191 పరుగులు చేశాడు. కానీ అతని బ్యాటింగ్ సగటు 38.20 మాత్రమే. దినేష్ కార్తీక్ స్ట్రైక్ రేట్ 209.97 ఉంటే ఇషాన్ కిషన్ స్ట్రైక్ రేట్ 117.17 మాత్రమే.
టీ20ల్లో కూడా తేడా కనిపిస్తోంది
దినేష్ కార్తీక్ భారత్ తరఫున 32 టీ20 మ్యాచ్‌లు ఆడిన 143.52 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. అదే ఇషాన్ కిషన్ స్ట్రైక్ రేట్ 10 మ్యాచ్‌ల్లో 121.42 మాత్రమే. దీంతో పాటు మ్యాచ్‌ని పూర్తి చేయగల అనుభవం, సామర్థ్యం దినేష్ కార్తీక్‌కు ఉన్నాయి. వీటితో పోల్చుకుంటే ఇషాన్ కిషన్‌కి జట్టులో చోటు అనుమానమే.