MS Dhoni: ఎంఎస్ ధోని రికార్డ్ ఇక్కడ.. బద్దలు కొట్టే దమ్ముందా ఎక్కడైనా.. 19 ఏళ్లుగా టచ్ చేయలే..

|

Aug 16, 2024 | 4:16 PM

MS Dhoni ODI Records: మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి ఎన్నో రికార్డులను సృష్టించాడు. ఇప్పటి వరకు ఎవరూ బద్దలు కొట్టలేకపోయిన ఓ రికార్డ్ కూడా తన ఖాతాలో ఉంది. ఈ రికార్డ్ చాలా సంవత్సరాలు అంటే దాదాపు 19 ఏళ్లుగా బద్దలు కాలేదు. అలాంటి రికార్డు ఒకటి 2005లో అతని పేరిట చేరింది. వాస్తవానికి, ఈ రికార్డును వికెట్లు కీపింగ్ చేస్తున్న సమయంలో వచ్చింది అనుకుంటే పొరబడినట్లే. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ధోని ఖాతాలో చేరిందన్నమాట.

MS Dhoni: ఎంఎస్ ధోని రికార్డ్ ఇక్కడ.. బద్దలు కొట్టే దమ్ముందా ఎక్కడైనా.. 19 ఏళ్లుగా టచ్ చేయలే..
Ms Dhoni Record
Follow us on

MS Dhoni ODI Records: మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి ఎన్నో రికార్డులను సృష్టించాడు. ఇప్పటి వరకు ఎవరూ బద్దలు కొట్టలేకపోయిన ఓ రికార్డ్ కూడా తన ఖాతాలో ఉంది. ఈ రికార్డ్ చాలా సంవత్సరాలు అంటే దాదాపు 19 ఏళ్లుగా బద్దలు కాలేదు. అలాంటి రికార్డు ఒకటి 2005లో అతని పేరిట చేరింది. వాస్తవానికి, ఈ రికార్డును వికెట్లు కీపింగ్ చేస్తున్న సమయంలో వచ్చింది అనుకుంటే పొరబడినట్లే. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ధోని ఖాతాలో చేరిందన్నమాట. 2005లో ధోనీ అలాంటి ఓ ఇన్నింగ్స్‌తో రికార్డుల దుమ్ము దులిపాడు. ఇది రికార్డు పుస్తకాల్లో నమోదైంది. ఇప్పటివరకు అత్యంత శక్తివంతమైన బ్యాట్స్‌మెన్ కూడా ధోనీ ఈ గొప్ప రికార్డును బ్రేక్ చేయలేకపోయాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

2005లో రికార్డ్ ఇన్నింగ్స్..

2005లో, వికెట్ కీపర్‌గా, ధోనీ శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 183 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను కేవలం 145 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్లతో ఈ పరుగులు చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో 2005 నుంచి ఎవరూ బ్రేక్ చేయలేని ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక స్కోరు ధోనీ బ్యాట్ నుంచి వచ్చింది. 2016లో దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డి కాక్ చాలా దగ్గరగా వచ్చాడు. కానీ, బ్రేక్ చేయలేకపోచాడు. డికాక్ 178 పరుగుల వద్ద ఔటయ్యాడు.

అద్భుత విజయం..

ధోనీ విధ్వంసక బ్యాటింగ్‌తో శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కుమార సంగక్కర 138 పరుగుల అజేయ సెంచరీతో శ్రీలంక 298 పరుగులకు ఆలౌటైంది. మహేల జయవర్ధనే 71 పరుగులు చేశాడు. 183 పరుగులతో అజేయంగా నిలిచిన ధోని ఇన్నింగ్స్ సంగక్కర, శ్రీలంకను ధీటుగా ఎదుర్కోవడంతో.. భారత్ మరో 23 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ధోనీ వన్డే కెరీర్‌లో ఇదే అతిపెద్ద ఇన్నింగ్స్‌.

వన్డే కెరీర్‌లో 10000కు పైగా పరుగులు..

ధోని తన వన్డే కెరీర్‌లో 10,000కు పైగా పరుగులు సాధించాడు. 350 వన్డే మ్యాచ్‌లు ఆడిన ఈ లెజెండ్ 10773 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్‌తో 10 సెంచరీలు కూడా కనిపించాయి. అతను 73 సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు. వన్డేల్లో అతని పేరిట 229 సిక్సర్లు కూడా ఉన్నాయి. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ ధోనీ అని మీకు తెలిసిందే. 2007లో టీ20 వరల్డ్‌కప్‌, 2011లో వన్డే ప్రపంచకప్‌, 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా ధోనీ నిలిచాడు. వికెట్ కీపర్‌గా ధోనీ ఈ ఫార్మాట్‌లో 321 క్యాచ్‌లు, 123 స్టంపింగ్‌లు కూడా చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..