వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఘోర తప్పిదం..!

|

Jul 15, 2019 | 4:23 PM

లండన్: వరల్డ్‌కప్ 2019… ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్ టోర్నీలు ఒక ఎత్తయితే.. ఈ టోర్నీ మరో ఎత్తు. చివరి బంతి వరకు ఇరు జట్ల పోరాటం వర్ణనాతీతం. రెండు జట్లకు విజయం ఆఖరి నిమిషం దాకా దోబూచులాడినా.. ఆతిధ్య ఇంగ్లాండే విశ్వవిజేతగా అవతరించింది. 27 ఏళ్ళ తర్వాత క్రికెట్‌కు పుట్టినిల్లైన ఇంగ్లాండ్‌కు ట్రోఫీ చేరింది. అన్ని విభాగాల్లో మోర్గాన్ సేన.. న్యూజిలాండ్‌పై ఆధిపత్యం చూపించింది. అయితే ప్రపంచకప్ ఇంగ్లాండ్ గెలిచినా.. క్రికెట్ అభిమానులకు మాత్రం కివీస్ కెప్టెన్ […]

వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఘోర తప్పిదం..!
Follow us on

లండన్: వరల్డ్‌కప్ 2019… ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్ టోర్నీలు ఒక ఎత్తయితే.. ఈ టోర్నీ మరో ఎత్తు. చివరి బంతి వరకు ఇరు జట్ల పోరాటం వర్ణనాతీతం. రెండు జట్లకు విజయం ఆఖరి నిమిషం దాకా దోబూచులాడినా.. ఆతిధ్య ఇంగ్లాండే విశ్వవిజేతగా అవతరించింది. 27 ఏళ్ళ తర్వాత క్రికెట్‌కు పుట్టినిల్లైన ఇంగ్లాండ్‌కు ట్రోఫీ చేరింది. అన్ని విభాగాల్లో మోర్గాన్ సేన.. న్యూజిలాండ్‌పై ఆధిపత్యం చూపించింది. అయితే ప్రపంచకప్ ఇంగ్లాండ్ గెలిచినా.. క్రికెట్ అభిమానులకు మాత్రం కివీస్ కెప్టెన్ విలియమ్సన్, ఆ జట్టు సభ్యుల పోరాటపటిమ ఎంతగానో నచ్చింది.

ఇది ఇలా ఉండగా ఆఖరి ఓవర్‌లో మార్టిన్ గప్తిల్ వేసిన త్రోకు బాల్ వెళ్లి స్టోక్స్ బ్యాట్‌కు తగలడం వల్ల న్యూజిలాండ్‌కు ప్రపంచకప్ చేజారిందని అందరూ అనుకునే విషయం. అయితే అసలు కారణం వేరే ఉంది. లీగ్ స్టేజి నుంచి అంపైర్ తప్పిదాల వల్ల చాలా పొరపాట్లు జరిగాయి. సరిగ్గా ఫైనల్‌లో కూడా అంపైర్ పొరపాటు వల్లే కివీస్‌‌కు ప్రపంచకప్ చేజారింది.

ఫైనల్ ఓవర్ వీడియో తీక్షణంగా పరిశీలించిన ప్రతి అభిమాని అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 49.4 బాల్ వద్ద ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బెన్ స్టోక్స్ రెండో రన్ తీస్తూ క్రీజుకు చేరే క్రమంలో గప్తిల్ వేసిన త్రోకు బంతి బ్యాట్‌కు తగిలి బౌండరీకి వెళ్ళింది. రెండో రన్ పూర్తి చేయకుండానే బంతి బౌండరీకి పోయింది కాబట్టి అంపైర్ 5 రన్స్ ఇవ్వాలి. కానీ అంపైర్లు 6 రన్స్ ప్రకటించారు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఐసీసీ చర్యల పట్ల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి జాగ్రత్తగా లుక్కేయండి‌.