
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తన మూడు నెలల కుమారుడు అబ్దుల్లాతో కలిసి భారత దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోని దిగిన ఫోటో వైరల్ అయింది. ఎనిమిది సంవత్సరాల తరువాత, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమీపిస్తున్న వేళ, ఆ ఫోటో వెనుక ఉన్న అసలు కథను సర్ఫరాజ్ వెల్లడించాడు.
ఆ రోజు ధోని తన కుటుంబ స్నేహితులతో కలిసి ఉండగా, సర్ఫరాజ్ తన కుమారుడితో ఉన్నాడు. ధోని ఆ క్షణాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలని భావించి, చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని ఫోటో దిగాడు. ఈ దృశ్యం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
సర్ఫరాజ్, ధోనితో సమయాన్ని గడుపుతూ వికెట్ కీపింగ్, కెప్టెన్సీ గురించి సుదీర్ఘంగా చర్చించాడు. “వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్, కెప్టెన్‌గా అన్ని బాధ్యతలను ధోని ఎలా సమతుల్యం చేసుకున్నాడో నేను ప్రశ్నించాను. అతను ఎంతో వినయంగా, ఓర్పుతో తన అనుభవాలను నాతో పంచుకున్నాడు. అతని చిట్కాలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి,” అని సర్ఫరాజ్ గుర్తు చేసుకున్నాడు.
2017 ఛాంపియన్స్ ట్రోఫీలో సర్ఫరాజ్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు భారత్‌ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఆ ఫైనల్లో పాకిస్తాన్ 180 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ మెగా టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్నా, భారత్-పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్‌లో ఫిబ్రవరి 23న జరగనుంది. 1996 ప్రపంచ కప్ తరువాత పాకిస్తాన్‌లో ఐసిసి టోర్నమెంట్ నిర్వహించడం ఇదే మొదటిసారి.
భారతదేశం, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగకపోయినా, రెండు దేశాల క్రికెటర్ల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని సర్ఫరాజ్ తెలిపారు. “మ్యాచ్‌ల తర్వాత షోయబ్ మాలిక్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, ధోని వంటి ఆటగాళ్లు కలిసి కబుర్లు చెప్పుకుంటూ గడపడం సహజం” అని అన్నారు.
ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. భారతదేశం తన మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కోసం పోటీ చేస్తుండగా, పాకిస్తాన్ వరుసగా రెండో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (WK), రిషబ్ పంత్ (WK), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్. షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.
రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (WK), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..