HBD Yuzvendra Chahal: ‘నువ్వు చాలా మంచోడివి.. నీకు వీరాభిమానిని’.. రొమాంటిక్ ఫొటో‌తో విష్ చేసిన చాహల్ భార్య..

| Edited By: Venkata Chari

Jul 23, 2022 | 5:45 PM

Yuzvendra Chahal Birthday: నేడు (జూలై 23) టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన భార్య ధన్‌శ్రీ వర్మ ఓ రొమాంటిక్ పోస్ట్‌ను నెట్టింట్లో పంచుకుంది.

HBD Yuzvendra Chahal: నువ్వు చాలా మంచోడివి.. నీకు వీరాభిమానిని.. రొమాంటిక్ ఫొటో‌తో విష్ చేసిన చాహల్ భార్య..
Yuzvendra Chahal's Wife Dhanashree Verma
Follow us on

టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పుట్టినరోజు నేడు (23 జులై). అతనికి 32 ఏళ్లు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన భార్య ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో ఓ అందమైన ఫోటోను పోస్ట్ చేసి, ప్రత్యేకంగా విష్ చేసింది. దీనితో పాటు, ఆమె తన భర్త కోసం దేవుని ఆశీర్వాదం కూడా కోరింది. ధనశ్రీ తాను యుజ్వేంద్ర చాహల్‌కి అతి పెద్ద అభిమానిని అంటూ రాసుకొచ్చింది. సోషల్ మీడియాలో యుజ్వేంద్ర చాహల్‌తో పంచుకున్న ఈ ఫొటోలో, ఈ జంట చాలా అందంగా కనిపించింది. ఈ ఫోటోతో, ధనశ్రీ, ‘జీవితం ఒక ప్రయాణం. కానీ, అది ఎన్నో విధాలుగా అందంగా ఉంది. నువ్వు చాలా మంచి మనిషివి. దేవుడు నిన్ను ఎల్లవేళలా కరుణిస్తాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు యుజ్వేంద్ర చాహల్. నేను మీకు పెద్ద అభిమానిని’ అంటూ రాసుకొచ్చింది.

యుజ్వేంద్ర చాహల్ ధనశ్రీ వర్మను డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్నాడు. ధనశ్రీ వర్మ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియాలోనూ చాలా ఫేమస్. ఆమె తరచూ తన డ్యాన్స్ వీడియోలను నెట్టింట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

విండీస్ పర్యటనలో చాహల్ ఫుల్ బిజీ..

ఈ సమయంలో చాహల్ భారత జట్టుతో కలిసి విండీస్ పర్యటనలో ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 2 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 3 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. చాహల్ ప్రస్తుతం వైట్ బాల్ క్రికెట్‌లో టీమిండియా లీడ్ స్పిన్నర్‌గా తన సత్తా చాటుతున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..