Chahal-Dhanashree: ధనశ్రీ, చాహల్ విడిపోయింది అందుకా.. తెరపైకి వచ్చిన అసలు కారణం..?

Dhanashree Verma and Yuzvendra Chahal Divorce Reason: యుజ్వేంద్ర చాహల్, అతని భార్య, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. బాంద్రా ఫ్యామిలీ కోర్టులో ఈ మేరకు విడాకుల ప్రక్రియ పూర్తయినట్లు వీడియో కూడా వస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు వీరిద్దరి నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. కాగా, అసలు వీరిద్దరు విడిపోవడానికి అసలు కారణం కూడా కోర్టులో చెప్పినట్లు తెలుస్తోంది.

Chahal-Dhanashree: ధనశ్రీ, చాహల్ విడిపోయింది అందుకా.. తెరపైకి వచ్చిన అసలు కారణం..?
Chahal

Updated on: Feb 21, 2025 | 6:52 PM

Dhanashree Verma and Yuzvendra Chahal Divorce Reason: టీం ఇండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య, కొరియోగ్రాఫర్, నటి ధనశ్రీ వర్మ విడాకుల వార్త చాలా కాలంగా ముఖ్యాంశాలలో ఉంది. వారి సంబంధం గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారిద్దరూ చాలా కాలంగా కెమెరా ముందు కనిపించలేదు. సంవత్సరం ప్రారంభంలో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో విడాకుల వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ జంట దీని గురించి ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. అందుకే విడాకుల వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అనిపించాయి. ఎందుకంటే వారి విడాకుల వార్తలు కూడా గతంలో వచ్చిన సంగతి తెలిసిందే.

కానీ, ఈసారి విడాకుల వార్త నిజమేనని తేలింది. కోర్టు అధికారికంగా ఇద్దరి విడాకులకు ఆమోదం తెలిపింది. బాంద్రా ఫ్యామిలీ కోర్టులో వీరి విడాకులకు సంబంధించిన అన్ని అధికారిక ప్రక్రియలు పూర్తయ్యాయని, ఇప్పుడు ఇద్దరూ విడిపోయారని నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఈ విషయంలో ఆ జంట ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. మీడియా నివేదికల ప్రకారం, వారి విడాకులకు కారణం కూడా వెల్లడైంది. వారిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

ఈ కారణంగానే విడాకులు..

మీడియా నివేదికల ప్రకారం, ఈ జంట గత 18 నెలలుగా విడివిడిగా నివసిస్తున్నారు. ఇప్పుడు వారు విడిపోయారు. వారిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కోరారని, నిన్న బాంద్రా కోర్టులో వారి విడాకులకు ఆమోదం లభించిందని నివేదికలు చెబుతున్నాయి. విడాకులకు కారణం ఏమిటని కోర్టు వారిద్దరినీ అడిగినప్పుడు, వారు ‘ఇద్దరి మధ్య అనుకూలత సమస్యలు’ ఉన్నాయంటూ తెలిపారంట. కంపాటబిలిటీ ఇష్యూస్ అంటే ఇద్దరి అలవాట్లు, జీవనశైలి అనుకూలంగా లేకపోవడం, దాని కారణంగా వారిద్దరూ విడాకులు తీసుకొని ఈ సంబంధం నుంచి శాశ్వతంగా విముక్తి పొందారు. అయితే, ఈ జంట ఇంకా దీనిపై ఎటువంటి స్పందన ఇవ్వలేదు.

యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ డిసెంబర్ 2020 లో వివాహం చేసుకున్నారు. విడాకుల సందర్భంగా ధనశ్రీకి 60 కోట్ల రూపాయల భరణం లభించిందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, ఏదైనా వాదనను నమ్మే ముందు ఇద్దరి నుంచి అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాల్సిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us