Cricket: 9 బంతుల్లో 46 పరుగులు.. 4 ఫోర్లు, 5 సిక్సర్లతో ఊచకోత.. ఈ ముంబై ప్లేయర్ ఎవరంటే?

|

Jan 11, 2023 | 9:45 AM

క్రికెట్‌లో ఎప్పుడూ వయసు, అనుభవం ముందు పరిగణలోకి వస్తాయి. ఎంత ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన ఎక్స్‌పీరియన్స్ ఉంటే..

Cricket: 9 బంతుల్లో 46 పరుగులు.. 4 ఫోర్లు, 5 సిక్సర్లతో ఊచకోత.. ఈ ముంబై ప్లేయర్ ఎవరంటే?
Mumbai Indians Player
Follow us on

క్రికెట్‌లో ఎప్పుడూ వయసు, అనుభవం ముందు పరిగణలోకి వస్తాయి. ఎంత ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన ఎక్స్‌పీరియన్స్ ఉంటే.. అంత అలా పరుగులు రాబడతాడని అందరూ అనుకుంటారు. కానీ అది తప్పు.. ఇది ప్రూవ్ చేస్తూ 19 ఏళ్ల యువ ప్లేయర్ తాజాగా ఓ టీ20 మ్యాచ్‌లో అదరగొట్టాడు. అతడెవరో కాదు బేబీ ఏబీ డెవాల్డ్ బ్రెవిస్.

దక్షిణాఫ్రికా టీ20 లీగ్ మొదటి సీజన్.. మొదటి మ్యాచ్‌లో తన మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించాడు డెవాల్డ్ బ్రెవిస్. ప్రతి షాట్‌ బౌండరీ బయటికే.. క్రీజూలో ఉన్నంతసేపు సిక్సర్ల వర్షం కురిపించాడు. SA20 లీగ్ మొదటి మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్, ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ జోస్ బట్లర్ 42 బంతుల్లో 51 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ మిల్లర్(42) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో పార్ల్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. అయితే ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ జట్టుకు ఆ స్కోర్ చాలా తక్కువగా కనిపించింది.

MI కేప్ టౌన్‌కు డెవాల్డ్ బ్రూయిస్(70) ఓపెనర్‌గా దిగాడు. అతడితో పాటు మరో ఓపెనర్ ర్యాన్ రిక్‌‌ల్టన్(42) రెండు ఎండ్స్ నుంచి పరుగుల వరద పారించారు. దీంతో MI కేప్ టౌన్‌ మరో 26 బంతులు మిగిలి ఉండగానే 143 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. డెవాల్డ్ బ్రూయిస్ బ్యాట్‌తో వి‌జృంభించాడు. మైదానం నలువైపులా సిక్సర్ల వర్షం కురిపించాడు. 41 బంతుల్లో అజేయంగా 70 పరుగులు చేశాడు. 170 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 5 సిక్సర్లు, 4 ఫోర్లు బాదాడు. దీంతో అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.