Virat kohli: ఏం వాడకం భయ్యా! అచ్చం కోహ్లీ పోస్టును దించేసిన ఢిల్లీ పోలీస్..

విరాట్ కోహ్లీ అవనీత్ కౌర్ పోస్ట్‌కి లైక్ ఇవ్వడం సోషల్ మీడియాలో పెద్ద వివాదంగా మారింది. ఈ అంశాన్ని ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ సందేశం పేరుతో సెటైర్ రూపంలో వినోదాత్మకంగా ప్రస్తావించారు. కోహ్లీ ఇచ్చిన "ఆల్గోరిథం" వివరణపై రాహుల్ వైద్య ప్యారడీ చేసి మరింత హైప్తో వైరల్ అయ్యాడు. ఈ చిన్న ఇంటరాక్షన్ చుట్టూ సోషల్ మీడియా వినోదానికి నూతన రూపం దొరికినట్లైంది.

Virat kohli: ఏం వాడకం భయ్యా! అచ్చం కోహ్లీ పోస్టును దించేసిన ఢిల్లీ పోలీస్..
Virat Kohli Delhi Police

Updated on: May 06, 2025 | 3:25 PM

ఒక సాధారణ “లైక్” అయినా కావొచ్చు… కానీ అది ఇప్పుడు సోషల్ మీడియాను గజగజలాడించింది! విరాట్ కోహ్లీ అవనీత్ కౌర్ పోస్ట్‌కి కొట్టిన లైక్.. కావచ్చు కావొచ్చు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అది మొత్తం చర్చలకే కేంద్రబిందువైంది. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీస్ వాళ్లు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా సెటైరికల్ పోస్టుతో ఈ వివాదాన్ని ఊహించదగిన రీతికి తీసుకెళ్లారు.

ఢిల్లీ పోలీస్ పోస్టులో ఏముంది?

“మా కెమెరాలు చెక్ చేస్తూ ఉండగా, ఆల్గోరిథం చాలా ఇంటరాక్షన్లు రిజిస్టర్ చేసినట్టు కనిపించింది. ఇది వేగంగా నడిపేవారిని, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది… చలాన్లు ఇస్తాం… మీ సహకారానికి ధన్యవాదాలు. అంటూ పోస్టు పెట్టారు. ఇది మొదట తలచుకోదగ్గ సాధారణ ట్రాఫిక్ అవగాహన సందేశంలా కనిపించినా, కొద్దీ గంటల్లోనే ఇది విరాట్ కోహ్లీపై సెటైర్ అన్న అభిప్రాయంతో వైరల్ అయింది.

ఈ సందర్భం విరాట్ కోహ్లీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ వివాదంలో ఇచ్చిన వివరణతో పోల్చబడింది. కోహ్లీ అప్పట్లో చెప్పిన మాట.. “నా ఫీడ్ క్లియర్ చేస్తూ ఉండగా, ఆల్గోరిథం ఎటువంటి ఉద్దేశ్యం లేకుండా ఒక ఇంటరాక్షన్‌కి రిజిస్టర్ చేసినట్టుంది… అని వివరణ ఇచ్చారు విరాట్ కోహ్లీ. దీని వెనుక ఎటువంటి ఉద్దేశ్యం లేదు. అనవసరమైన అంచనాలు వేయవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. మీ అవగాహనకు ధన్యవాదాలు.” అయితే, విరాట్ యొక్క స్పష్టత త్వరలోనే సోషల్ మీడియా సైట్‌లలో మీమ్‌ల కోలాహలంగా మారింది.

ఈ వ్యవహారంపై గాయకుడు రాహుల్ వైద్య ఒక ప్యారడీ వీడియోను పోస్ట్ చేసి కోహ్లీని ఆటపట్టించాడు. తరువాత అతను చెప్పినట్టు, కోహ్లీ తనను బ్లాక్ చేశాడట… అది కూడా “ఆల్గోరిథమే అయి ఉండొచ్చు” అని పంచాడు!

రాహుల్ వైద్య మాట్లాడుతూ, “మెయిన్ కెహనా చాహ్తా హూన్ కి ఆజ్ కే బాద్ ఐసా హో సక్తా హై కి అల్గారిథమ్ బోహోట్ సారే ఫోటోలు కర్దే జో మైనే నహీ కరే. కాబట్టి, జో భీ లడ్కీ హో, దయచేసి దాని చుట్టూ PR చేయవద్దు, ఎందుకంటే ఇది నా తప్పు కాదు. ఇది ఇన్‌స్టాగ్రామ్ సరేనా?”

మరో వీడియోలో రాహుల్ ఇలా అన్నాడు, “కాబట్టి, అబ్బాయిలు, విరాట్ కోహ్లీ నన్ను బ్లాక్ చేసాడు, మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను వోహ్ భీ ఇన్‌స్టాగ్రామ్ కి గ్లిచ్ హోగీ, వో విరాట్ కోహ్లీ నే బ్లాక్ నహీ కియా హోగా అనుకుంటున్నాను. ఇన్‌స్టాగ్రామ్ కే అల్గారిథమ్ నే బోలా హోగా విరాట్ కోహ్లీ కో, ‘ఏక్ కామ్ కర్, మెయిన్ తేరే తరుపున పే రాహుల్ వైద్య హోకో’ హైనా? అంటూ రిప్లై ఇచ్చాడు.

మొత్తానికి… ఇది ఓ లైక్‌కే అయినా, విరాట్ కోహ్లీ, అవనీత్ కౌర్, ఢిల్లీ పోలీస్ & సోషల్ మీడియా అందరూ కలసి మేము చూడదగ్గ ఒక ఎంటర్టైనింగ్ సంఘటనను అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.