Delhi Capitals vs Chennai Super Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్‌లో ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్‌లోకి ప్రవేశించింది. ప్లేఆఫ్‌కు అర్హత సాధించిన రెండో జట్టుగా CSK నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ధోనీ సేన 77 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం తర్వాత, లీగ్ దశలో చెన్నై 17 పాయింట్లు సంపాదించగా, డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఢిల్లీ కేవలం 10 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది. ఢిల్లీపై చెన్నైకిది వరుసగా నాలుగో విజయంగా నిలిచింది.
అరుణ్ జైట్లీ మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (కీపర్), రిలీ రోసౌవ్, యష్ ధుల్, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్ట్జే.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..