IPL 2023: ఓటమి బాధతో హోటల్ రూంకి చేరిన ఢిల్లీ టీం.. లగేజీ బ్యాగ్‌లు ఓపెన్ చేసి చూడగా.. షాకింగ్ సీన్..

|

Apr 19, 2023 | 2:43 PM

IPL 2023: ఐపీఎల్ 2023 సీజన్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచుల్లోనూ వరుస ఓటములు చూసింది ఈ జట్టు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు తాజాగా మరో చేదు అనుభవం ఎదురైంది.

IPL 2023: ఓటమి బాధతో హోటల్ రూంకి చేరిన ఢిల్లీ టీం.. లగేజీ బ్యాగ్‌లు ఓపెన్ చేసి చూడగా.. షాకింగ్ సీన్..
Delchi Capital Ipl 2023
Follow us on

Delhi Capitals: ఐపీఎల్ 2023 సీజన్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచుల్లోనూ వరుస ఓటములు చూసింది ఈ జట్టు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు తాజాగా మరో చేదు అనుభవం ఎదురైంది. ఏప్రిల్ 15న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ చేతిలో పరాజయం పాలైంది ఢిల్లీ క్యాపిటల్స్. మ్యాచ్ ముగిసిన తర్వాత అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకుంది. హోటల్ రూమ్‌లో లగేజీ బ్యాగులను చెక్ చేసుకోగా.. కొందరి బ్యాట్లు, ప్యాడ్లు, ఇతర క్రికెట్ కిట్లు కనిపించకుండా పోయాయి. అయితే దీనిపై ఢిల్లీ జట్టు యాజమాన్యం ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలా కనిపించకుండా పోయిన వాటిల్లో కెప్టెన్ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ బ్యాట్లు కూడా ఉన్నాయట.

చోరీకి గురైన వాటి విలువ 16 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. బెంగళూరు నుంచి ఢిల్లీకి వచ్చిన అనంతరం వీరంతా తమ హోటల్ రూమ్ లకు చేరుకున్నారు. తర్వాత అక్కడికి చేరిన లగేజీ బ్యాగులను పరిశీలించినప్పుడు చోరీ విషయాన్ని గుర్తించారు. డేవిడ్ వార్నర్, ఫిల్ సాల్ట్ కు చెందిన చెరో మూడు బ్యాట్లు, మిచెల్ మార్ష్ కు చెందిన రెండు బ్యాట్లు మిస్ అయ్యాయి. కొందరు ఆటగాళ్ల షూస్, గ్లోవ్ లు కూడా చోరీకి గురయ్యాయి. ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి అని ఢిల్లీ క్యాపిటల్స్ వర్గాలు తెలిపాయి. దీనిపై లాజిస్టిక్స్ కంపెనీకి, పోలీసులకు, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బందికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..