Rishabh Pant: అయ్యర్ స్థానంలో రిషబ్ పంత్.. నూతన సారథిని ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్..

|

Mar 31, 2021 | 12:05 AM

Delhi Capitals: ఐపీఎల్ సీజన్ దగ్గరపడుతుండటంతో.. ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్

Rishabh Pant: అయ్యర్ స్థానంలో రిషబ్ పంత్.. నూతన సారథిని ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్..
Rishabh Pant
Follow us on

Delhi Capitals: ఐపీఎల్ సీజన్ దగ్గరపడుతుండటంతో.. ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ను ఆ జట్టు కెప్టెన్‌గా ప్రకటించింది. ఈ విషయాన్ని జట్టు మేనేజ్‌మెంట్ మంగళవారం స్వయంగా వెల్లడించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో.. గాయం కారణంగా ఢిల్లీ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్‌కు పూర్తిగా దూరం అయ్యాడు. దీంతో అతని స్థానంలో రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా చేస్తున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ వెల్లడించింది.

అయ్యర్.. బంతిని ఆపేందుకు డైవ్ చేయడంతో అతడి భుజం గట్టిగా నేలను తాకింది. దీంతో ఎడమ చేతికి, భూజానికి గాయమైంది. దీని కారణంగా మైదానంలోనే విలవిలలాడిన అయ్యర్ వెంటనే మైదానాన్ని వీడాడు. అనంతరం మెడికల్ సిబ్బంది టెస్టులు నిర్వహించి గాయం చాలా తీవ్రమైందని వెల్లడించారు. ఆ తర్వాత అయ్యర్.. రెండు వన్డేల నుంచి కూడా తప్పుకున్నాడు. దీంతోపాటు ఐపీఎల్ 2021 నుంచి కూడా పూర్తిగా తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. గాయం కారణంగా.. అయ్యర్ ఆగస్టులో వెళ్లాల్సిన ఇంగ్లండ్‌ పర్యటనకు, సెప్టెంబర్‌లో స్వదేశంలో జరగనున్న న్యూజిలాండ్‌, సౌత్ఆఫ్రికా టీ20 సిరీస్‌లకు పూర్తిగా దూరమయ్యాడు.

ఈ స్థానానికి మాజీ ఐపీఎల్ కెప్టెన్లైన స్టీవ్ స్మిత్ , అజింక్య రహానె , రవిచంద్రన్ అశ్విన్‌, పంత్ పోటీలో నిలవగా.. ఢిల్లీ పంత్‌నే కెప్టెన్‌గా ప్రకటించింది. పంత్ ఐపిఎల్ జట్టుకు నాయకత్వం వహించడం ఇదే మొదటిసారి. అంతకుముందు రంజీ ట్రోఫీలో ఢిల్లీ రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహించాడు.

Also Read:

ముద్దుగుమ్మలు కదా అని లైట్ తీసుకున్నారు.. గురి పెడితే మటాష్.. తాజాగా రికార్డులు బద్దలు కొట్టారు..

Irfan Pathan: ఆ సిరీస్‌లో పాల్గొన్న మరో మాజీ క్రికెటర్‌కు కరోనా పాజిటివ్.. ఆందోళనలో మరికొంత మంది..