ఢిల్లీ బౌలర్ల ధాటికి రాయల్స్ విలవిల

ఐపీఎల్ లో భాగంగా ఇవాళ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 116 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ ఢిల్లీ బౌలర్ల ధాటికి తక్కువ స్కోరుకే పరిమితమైంది. రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ (50; 49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రహానే(2), లివింగ్‌ స్టోన్‌(14), సంజూ శాంసన్‌(5) ఇలా టాప్ బ్యాట్స్‌మెన్ అందరూ క్యూ కట్టి […]

ఢిల్లీ బౌలర్ల ధాటికి రాయల్స్ విలవిల
Follow us

|

Updated on: May 04, 2019 | 6:35 PM

ఐపీఎల్ లో భాగంగా ఇవాళ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 116 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ ఢిల్లీ బౌలర్ల ధాటికి తక్కువ స్కోరుకే పరిమితమైంది. రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ (50; 49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రహానే(2), లివింగ్‌ స్టోన్‌(14), సంజూ శాంసన్‌(5) ఇలా టాప్ బ్యాట్స్‌మెన్ అందరూ క్యూ కట్టి పెవిలియన్‌కు చేరడంతో రాజస్థాన్ తేరుకోలేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా మూడేసి వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీశాడు.