DCW vs RCBW: ఢిల్లీకి చుక్కలు చూపించిన శ్రేయాంక, సోఫీ.. బెంగళూరు టార్గెట్ 114

మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్-2 చివరి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతోంది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ షెఫాలీ వర్మ 27 బంతుల్లో 44 పరుగులతో ఇన్నింగ్స్ ఆడింది. కెప్టెన్ మెగ్ లానింగ్ 23 పరుగులు చేసింది. బెంగళూరు తరపున శ్రేయాంక పాటిల్ 4 వికెట్లు తీయగా, సోఫీ మోలినెక్స్ 3 వికెట్లు తీశారు. ఆశా శోభనకు రెండు వికెట్లు దక్కాయి.

DCW vs RCBW: ఢిల్లీకి చుక్కలు చూపించిన శ్రేయాంక, సోఫీ.. బెంగళూరు టార్గెట్ 114
Shreyanka Patil DC vs RCB wpl 2024

Updated on: Mar 17, 2024 | 9:22 PM

మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్-2 చివరి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతోంది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఢిల్లీ 114 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇచ్చింది.

ఓపెనర్ షెఫాలీ వర్మ 27 బంతుల్లో 44 పరుగులతో ఇన్నింగ్స్ ఆడింది. కెప్టెన్ మెగ్ లానింగ్ 23 పరుగులు చేసింది. బెంగళూరు తరపున శ్రేయాంక పాటిల్ 4 వికెట్లు తీయగా, సోఫీ మోలినెక్స్ 3 వికెట్లు తీశారు. ఆశా శోభనకు రెండు వికెట్లు దక్కాయి.

ఇవి కూడా చదవండి

ఒక్క మార్పుతో ఢిల్లీ, బెంగళూరులో నో ఛేంజ్..

ఢిల్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫైనల్ మ్యాచ్ కోసం కెప్టెన్ మెగ్ లానింగ్ మునుపటి మ్యాచ్ ప్లేయింగ్-11లో ఎలాంటి మార్పులు చేయలేదు. బెంగళూరులో, శ్రద్ధా పోకర్కర్ స్థానంలో ఎస్ (సబ్బినేని) మేఘన తిరిగి వచ్చింది.

ఇరుజట్ల ప్లేయింగ్ 11:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, సబ్బినేని మేఘన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ (కీపర్), సోఫీ మోలినక్స్, జార్జియా వేర్‌హామ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, శ్రద్ధా పోఖర్కర్, రేణుకా థాకర్కర్, రేణుక.

ఢిల్లీ క్యాపిటల్స్(ప్లేయింగ్ XI): మెగ్ లానింగ్(కెప్టెన్), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజాన్ కాప్, జెస్ జోనాస్సెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా(కీపర్), శిఖా పాండే, మిన్ను మణి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..