టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ బంపరాఫర్ కొట్టేసింది. గత కొన్నేళ్లుగా అటు బంతి, ఇటు బ్యాట్‌తో అద్భుతంగా రాణిస్తోన్న ఈ స్టార్ ప్లేయర్‌ను యూపీ వారియర్స్ ఏకంగా రూ.2.60 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలో దీప్తి శర్మను కొనుగోలు చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు పోటీపడ్డాయి. చివరకు రూ.2.6 కోట్లకు దీప్తి శర్మను యూపీ వారియర్స్ జట్టు కొనుగోలు చేసింది. కాగా 25 ఏళ్ల దీప్తి శర్మ బౌలింగ్‌తో పాటు బ్యాటుతోనూ రాణించడంతో మేటి ఆల్ రౌండర్‌గా గుర్తింపు పొందింది. మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న దీప్తి శర్మ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. 25 ఏళ్ల ఈ భారత ప్లేయర్ బౌలింగ్‌తో పాటు బ్యాటుతోనూ రాణించడంతో ఆల్ రౌండర్‌గా గుర్తింపు పొందింది. మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు 85 టీ-20 మ్యాచ్‌లు ఆడిన దీప్తి శర్మ 6.14 ఎకానమీ రేటుతో 92 వికెట్లు పడగొట్టింది. గత మూడు నెలల్లో 16 మ్యాచ్‌ల్లో 5.89 ఎకానమీ రేటుతో 24 వికెట్లు పడగొట్టింది. ఇక ఆదివారం (ఫిబ్రవరి 12) పాక్‌తో మ్యాచ్ ద్వారా ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది దీప్తిశర్మ. అదేంటంటే.. వరుసగా 50కి పైగా టీ20 మ్యాచ్‌లు ఆడిన రెండో టీమిండియా క్రికెటర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. కాగా పురుషుల క్రికెట్‌లో దిగ్గజాలుగా చెప్పుకునే మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతో పాటు ఎవరూ ఈ రికార్డును అందుకోలేకపోవడం గమనార్హం.
కాగా గతేడాది ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు బ్యాటర్ చార్లీ డీన్‌ను దీప్తి శర్మ మన్కడింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఐసీసీ నిబంధనలకు అనుగుణంగానే ఆమె ఔట్ చేసినప్పటికీ కొందరు మాత్రం దీప్తి తీరుపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా చేతుల్లోకొచ్చిన మ్యాచ్ చేజారిపోవడంపై సహించలేని బ్రిటిష్ మీడియా ఈ ఘటనపై రచ్చ రచ్చ చేసింది. అదే సమయంలో దీప్తి శర్మకు కూడా పలువురి మద్దతు లభించింది. నిబంధనలకు అనుగుణంగానే ఆమె రనౌట్ చేసిందంటూ మాజీ క్రికెటర్లు, క్రీడా ప్రముఖులు అండగా నిలబడ్డారు.
.@UPWarriorz bring @Deepti_Sharma06 on board ? ?
The all-rounder joins the franchise for INR 2.60 Crore#WPLAuction pic.twitter.com/2s54y3NTKj
— Women’s Premier League (WPL) (@wplt20) February 13, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..