Delhi Capitals vs Punjab Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిస్తే పంజాబ్‌పై ఆ జట్టుకు ఇది వరుసగా 5వ విజయం కానుంది. 2020లో ఢిల్లీపై పంజాబ్ చివరి విజయం సాధించింది.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ.. అందులో నాలుగింటిలో మాత్రమే గెలిచి, 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 10 జట్ల పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు 8 పాయింట్లతో అట్టడుగున నిలిచింది.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్.. 5 గెలిచి, 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు 10 పాయింట్లతో ఉంది.
జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్(కెప్టెన్), ఫిలిప్ సాల్ట్(కీపర్), మిచెల్ మార్ష్, రిలీ రోసోవ్, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(కీపర్), సామ్ కర్రాన్, సికందర్ రజా, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..