David Warner: అందుకే డేవిడ్‌ భాయ్‌ నువ్వంటే మాకిష్టం.. తన ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును ఎవరికిచ్చాడో తెలుసా?

మ్యాచ్‌ ఓడిపోయినా సిరీస్ మాత్రం ఆస్ట్రేలియానే గెల్చుకుంది. ఈ సిరీస్ విజయంలో డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించాడు.. ఈ ఆటగాడు 3 మ్యాచ్‌ల్లో 2 అర్ధ సెంచరీల సాయంతో 173 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 166 కంటే ఎక్కువ. దీంతో వార్నర్‌కి ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు దక్కింది. మైదానంలో తన ధనాధన్‌ బ్యాటింగ్‌ తో ఆడియెన్స్‌ను మంత్ర ముగ్ధులను చేసే డేవిడ్ వార్నర్‌ ఆఫ్‌ పీల్డ్‌లోనూ అందరి మనసులు గెల్చుకున్నాడు.

David Warner: అందుకే డేవిడ్‌ భాయ్‌ నువ్వంటే మాకిష్టం.. తన ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును ఎవరికిచ్చాడో తెలుసా?
David Warner

Updated on: Feb 14, 2024 | 7:16 AM

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ ఘన విజయం సాదించింది. హోరాహొరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై 37 పరుగుల తేడాతో గెలుపొందింది విండీస్‌. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 220 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు కేవలం 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. మ్యాచ్‌ ఓడిపోయినా సిరీస్ మాత్రం ఆస్ట్రేలియానే గెల్చుకుంది. ఈ సిరీస్ విజయంలో డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించాడు.. ఈ ఆటగాడు 3 మ్యాచ్‌ల్లో 2 అర్ధ సెంచరీల సాయంతో 173 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 166 కంటే ఎక్కువ. దీంతో వార్నర్‌కి ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు దక్కింది. మైదానంలో తన ధనాధన్‌ బ్యాటింగ్‌ తో ఆడియెన్స్‌ను మంత్ర ముగ్ధులను చేసే డేవిడ్ వార్నర్‌ ఆఫ్‌ పీల్డ్‌లోనూ అందరి మనసులు గెల్చుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్న తర్వాత, వార్నర్ చేసిన పనిని ఇప్పుడు ప్రజలు ప్రశంసిస్తున్నారు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్న తర్వాత డేవిడ్ వార్నర్ దానిని స్టేడియంలో కూర్చున్న చిన్నారికి ఇచ్చాడు. వార్నర్ నుంచి తన ట్రోఫీని అందుకున్నందుకు ఆ చిన్నారి ఎంతో సంతోషించింది. డేవిడ్ వార్నర్ మ్యాచ్‌ల సమయంలో అభిమానులకు తరచుగా ఇలా బహుమతులు ఇస్తుంటాడు. గతంలో పలు సందర్భాల్లో తన గ్లోవ్స్‌ను స్టేడియంలోని ప్రేక్షకులకు కానుకగా ఇచ్చాడు. ఇప్పుడు పెర్త్ మైదానంలో ఓ అభిమానికి తన ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్ ట్రోఫీని కానుకగా అందించాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. వార్నర్‌ చేసిన మంచి పనిని క్రికెట్‌ అభిమానులు కొనియాడుతున్నారు. టీమిండియా క్రికెట్‌ ఫ్యాన్స్‌ కూడా డేవిడ్‌ వార్నర్‌ చేసిన మంచి పనిని మెచ్చుకుంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే వార్నర్ గత నెలలో టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇక ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్‌కు కూడా గుడ్‌బై చెప్పనున్నాడని తెలుస్తోంది. స్వదేశంలో వార్నర్‌కి ఇదే చివరి T20 సిరీస్, పెర్త్‌లో ఆడిన ఈ మ్యాచ్ స్వదేశంలో అతని చివరి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ అని తెలుస్తోంది. ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు ముందు డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2024లో కనిపించనున్నాడు. రిషబ్ పంత్ ఫిట్‌నెస్ ఇంకా ప్రశ్నార్థకంగానే ఉన్నందున అతను ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశముందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

వార్నర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుతో చిన్నారి..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us