David Warner: భార్యకు వార్నర్ తెలుగులో లవ్ ప్రపోజ్.. ”నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అంటూ..

|

May 28, 2021 | 8:45 AM

ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి తెలుగుపై అభిమానాన్ని చాటుకున్నాడు. తన భార్య కాండీస్‌ను ఎత్తుకున్నట్లు...

David Warner: భార్యకు వార్నర్ తెలుగులో లవ్ ప్రపోజ్.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ..
David Warner (1)
Follow us on

ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి తెలుగుపై అభిమానాన్ని చాటుకున్నాడు. తన భార్య కాండీస్‌ను ఎత్తుకున్నట్లు ఉన్న ఫొటోనూ, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. అంతేకాదు ఆ ఫోటోకు క్యాప్షన్‌గా ”నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అంటూ తెలుగు వ్యాక్యాన్ని ఇంగ్లీష్‌లో రాశాడు. దీనికి 7.80లక్షల లైక్స్‌ వచ్చాయి. ఇక ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్స్‌ ”నువ్వు కేక డేవిడ్‌ మామ” అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలోనూ వార్నర్‌ తెలుగు పాటలకు టిక్‌టాక్‌ వీడియోలు చేసి అభిమానులను అలరించిన విషయం తెలిసిందే.

ఇక సన్‌రైజర్స్‌ జట్టు డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఐపీఎల్‌ మిగిలిన టోర్నమెంట్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఆగష్టులో ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుండటమే దీనికి కారణం. ఈ పర్యటన పూర్తయ్యేసరికి ఐపీఎల్ సెకండాఫ్‌లో సగం మ్యాచ్‌లు అయిపోతాయి. కాగా, కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ను సెప్టెంబర్ 15-అక్టోబర్ 15 మధ్య యూఏఈ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది.

Also Read:

మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?

టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?

సర్కస్‌ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!