AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలా ఎలా కొట్టావ్ అన్న.. ఒకే ఓవర్‌లో 39 పరుగులా! ప్రపంచ రికార్డు బద్దలు

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలన ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2024లో వనువాటుతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 39 పరుగులు బాదాడు. ఆ ఓవర్‌లో ఆరు సిక్సర్లు, మూడు నోబాల్స్ నమోదయ్యాయి. విస్సర్ మొత్తం 62 బంతుల్లో 132 పరుగులతో సమోవాకు విజయాన్ని అందించాడు. ఈ ప్రదర్శన క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది.

అలా ఎలా కొట్టావ్ అన్న.. ఒకే ఓవర్‌లో 39 పరుగులా! ప్రపంచ రికార్డు బద్దలు
Darius Visser 39 Runs
SN Pasha
|

Updated on: Aug 29, 2026 | 11:50 AM

Share

క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 39 పరుగులు సాధించడం సాధ్యమేనా? అలా ఎలా.. ఒక ఓవర్‌కు 6 బంతులు. ప్రతి బాల్ సిక్స్ కొట్టినా.. 36 పరుగులు మాత్రమే వస్తాయి. అలా జరిగిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. కానీ ఒక్క ఓవర్‌లో 39 పరుగులు ఎలా సాధ్యం. అయితే ఈ స్టోరీ పూర్తిగా చదివేయండి. సమోవా బ్యాటర్ డారియస్ విస్సర్ అసాధ్యమనుకున్నదాన్ని సుసాధ్యం చేశాడు. వనువాటుతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఈస్ట్ ఏషియా-పసిఫిక్ రీజినల్ క్వాలిఫయర్‌లో ఒకే ఓవర్‌లో 39 పరుగులు సాధించి పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

ఆ ఒక్క ఓవర్‌లో ఏం జరిగింది?

సమోవా ఇన్నింగ్స్‌లో 15వ ఓవర్‌ను వనువాటు బౌలర్ నలిన్ నిపికో వేశాడు. అప్పటికి డారియస్ విస్సర్ 46 పరుగులతో ఉన్నాడు. మొదటి మూడు బంతులకే వరుసగా మూడు సిక్సర్లు బాదిన విస్సర్.. ఆ తర్వాతి లీగల్ డెలివరీలోనూ బౌండరీ దాటించాడు. ఓవర్‌లో మూడు నోబాల్స్ రావడంతో బౌలర్‌పై మరింత ఒత్తిడి పెరిగింది. మొత్తంగా ఆ ఓవర్‌లో ఆరు సిక్సర్లు, మూడు నోబాల్స్, ఒక డాట్ బాల్ నమోదయ్యాయి. దీంతో 39 పరుగులు వచ్చాయి.

ఈ 39 పరుగుల్లో విస్సర్ బ్యాట్ నుంచి 36 పరుగులు వచ్చాయి. మిగిలిన మూడు పరుగులు నోబాల్స్ ద్వారా లభించాయి. ఈ ప్రదర్శనతో ఒక టీ20 అంతర్జాతీయ ఓవర్‌లో అత్యధిక పరుగుల రికార్డు విస్సర్ పేరిట నమోదైంది. అంతకుముందు 36 పరుగుల రికార్డు యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్, దీపేంద్ర సింగ్ ఐరీ, నికోలస్ పూరన్ పేరిట ఉంది.

132 పరుగులతో చరిత్ర

ఒక్క ఓవర్‌తోనే ఆగిపోని విస్సర్.. మొత్తం ఇన్నింగ్స్‌లో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. కేవలం 62 బంతుల్లో 132 పరుగులు చేశాడు. ఇందులో 14 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. అంతేకాదు, సమోవా తరఫున టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా కూడా చరిత్ర సృష్టించాడు. విస్సర్ వీరోచిత ఇన్నింగ్స్‌తో సమోవా 20 ఓవర్లలో 174 పరుగులు చేసింది. అనంతరం బౌలింగ్‌లోనూ విస్సర్ ఒక వికెట్ పడగొట్టాడు. చివరికి వనువాటును 164/9కే పరిమితం చేసి సమోవా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. విస్సర్ సాధించిన 39 పరుగుల ఓవర్ ఇప్పటికీ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత సంచలన రికార్డుల్లో ఒకటిగా నిలిచిపోయింది.

Follow Us