31 బంతుల్లో సెంచరీ.. 11 సిక్సర్లు, 8 ఫోర్లు.. బౌలర్లను ఊచకోత కోసిన ఈ బ్యాట్స్‌మెన్‌ ఎవరంటే..?

|

Oct 02, 2021 | 7:40 PM

Cricket News: క్రికెట్ చరిత్రలో ఎన్నో మెరుపు సెంచరీలు నమోదైనప్పటికీ ఈ బుల్లెట్‌ సెంచరీ గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. కేవలం 19 బంతుల్లో 98 పరుగులు పిండేశాడు.

31 బంతుల్లో సెంచరీ.. 11 సిక్సర్లు, 8 ఫోర్లు.. బౌలర్లను ఊచకోత కోసిన ఈ బ్యాట్స్‌మెన్‌ ఎవరంటే..?
Dan Lincoln
Follow us on

Cricket News: క్రికెట్ చరిత్రలో ఎన్నో మెరుపు సెంచరీలు నమోదైనప్పటికీ ఈ బుల్లెట్‌ సెంచరీ గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. కేవలం 19 బంతుల్లో 98 పరుగులు పిండేశాడు. మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ అద్భుతం యూరోపియన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో జరిగింది. డ్రీమ్ 11 యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా గ్రూప్ సి ఫైనల్లో, ఇటలీ వర్సెస్‌ ఇంగ్లాండ్ ఎలెవన్‌ మధ్య ఆసక్తికర మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇటలీ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.

10 ఓవర్లలో 6 వికెట్లకు 141 పరుగులు చేసింది. తర్వాత ఇంగ్లాండ్ 9.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని చేధించింది. 6 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది. కానీ ఇందులో ఒక బ్యాట్స్‌మన్ తుపాన్‌ సృష్టించాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. ఓపెనర్‌గా వచ్చిన ఈ బ్యాట్స్‌మన్ స్ట్రైక్ రేట్ 300 పైన నమోదైంది. అంటే ఎంత డేంజర్‌గా ఆడాడో అర్థమవుతుంది. ఇంగ్లాండ్ ఎలెవన్ కోసం ఓపెనింగ్‌కి వచ్చిన 26 ఏళ్ల బ్యాట్స్‌మన్ డాన్ లోన్‌కాల్. ఇతడు కేవలం 31 బంతుల్లోనే సెంచరీ చేశాడు.105 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు.

11 సిక్సర్లు, 8 ఫోర్లు కొట్టాడు. అంటే కేవలం19 బంతుల్లో 98 పరుగులు సాధించాడు. 26 ఏళ్ల డాన్ లింకన్ ఒంటరిగా ఇటాలియన్ జట్టు నిర్దేశించిన లక్ష్యంలో సగానికి పైగా స్కోర్ చేశాడు.అంతకుముందు ఇటలీ జట్టు 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఈ స్కోరులో జట్టు కెప్టెన్ బల్జిత్ సింగ్ అత్యధికంగా 62 పరుగులు చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ స్కోరును ఛేజ్ చేయడానికి ఇంగ్లాండ్ కెప్టెన్‌ డాన్ లింకన్ తుపాన్ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇద్దరు కెప్టెన్లు కావడం విశేషం.

Viral Photos: ఈ చేప వల్ల మానవులకు చాలా ప్రమాదం..! ఏంటో తెలుసుకోండి..

BJP Praja Sangrama Yatra: సీఎం ఎవరైనా మొదటి సంతకం దానిపైనే.. బండి సంజయ్ కీలక ప్రకటన..!

Huzurabad By Election: హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్‌ఎస్‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ ఖరారు