Devon Conway: ‘భూమ్మీదకు రాకుండానే మా బిడ్డను కోల్పోయాం’.. స్టార్‌ క్రికెటర్‌ ఇంట్లో తీవ్ర విషాదం

|

Feb 10, 2024 | 9:03 PM

న్యూజిలాండ్‌ డ్యాషింగ్ క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. త్వరలోనే పండంటి బిడ్డకుఆహ్వానం పలుకుదామని ఎదురుచూస్తోన్న కాన్వే దంపతులకు తీరని శోకం మిగిలింది. కాన్వే భార్య కిమ్‌ వాట్సన్‌కు అబార్షన్ అయ్యింది.

Devon Conway: భూమ్మీదకు రాకుండానే మా బిడ్డను కోల్పోయాం.. స్టార్‌ క్రికెటర్‌ ఇంట్లో తీవ్ర విషాదం
Devon Conway Family
Follow us on

న్యూజిలాండ్‌ డ్యాషింగ్ క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. త్వరలోనే పండంటి బిడ్డకుఆహ్వానం పలుకుదామని ఎదురుచూస్తోన్న కాన్వే దంపతులకు తీరని శోకం మిగిలింది. కాన్వే భార్య కిమ్‌ వాట్సన్‌కు అబార్షన్ అయ్యింది. దీంతో ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టుకుండానే తల్లి గర్భంలోనే పాపాయి కన్నుమూసింది. ఈ విషాదం గురించి కాన్వే భార్య సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ‘ నా పర్సనల్‌ లైఫ్ గురించి అందరితో షేర్‌ చేసుకోవడానికి నేను పెద్దగా ఆసక్తి చూపను. కానీ గర్భస్రావం వల్ల నాలాంటి ఎంతో మంది మహిళలు ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో నాకు బాగా అర్థమైంది. ఈ విషయాన్ని చెప్పడానికి నేనేమీ బాధపడటం లేదు. సిగ్గూ పడడమూ లేదు. రేపు నాలాగే ఏ మహిళకైనా ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదురుకావొచ్చు. అందుకు ఆమె హృదయం ముక్కలైతే తట్టుకునే శక్తి ఉండాలి. అందుకే ఇలా నా మనసులోని ఆలోచనలు, భావాలను ఇలా అందరితో షేర్‌ చేసుకుంటున్నాను. ఏదో ఒక రోజు మా జీవితాల్లో మళ్లీ అద్భుతం జరుగుతుంది. మా బిడ్డ తిరిగి వస్తే బోలెడంత ప్రేమను అందించేందుకు మేం ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది కాన్వే భార్య.

కాగా జనవరి 31న కిమ్‌ ఈ పోస్టు షేర్‌ చేసింది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న క్రికెట్‌ అభిమానులు, నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. కాన్వే దంపతులకు ధైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాళ్లలో ఒకరైన డెవాన్‌ కాన్వే ఐపీఎల్‌ తో భారత అభిమానులకు బాగా చేరువయ్యాడు.ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతను ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. ధోని టీమ్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గత సీజన్‌ లో ఏకంగా 672 పరుగులు సాధించి సీఎస్కే ఐదోసారి ఐపీఎల్‌ కప్‌ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు కాన్వే. ఆ సీజన్‌ లో అత్యధిక పరుగుల సాధించిన బ్యాటర్లలో మూడో స్థానంలో నిలిచాడు. ఇక కాన్వే- కిమ్‌ లది ప్రేమ వివాహం. 2022లో వీరికి వివాహం జరిగింది.

ఇవి కూడా చదవండి

డెవాన్ కాన్వే సతీమణి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

క్రికెట్ అభిమానుల సంఘీభావం..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..