CSK vs RCB Highlights: శివం దూబే, రాబిన్ ఉతప్ప మెరుపు ఇన్సింగ్స్.. 23 పరుగుల తేడాతో సీఎస్కే విజయం..

| Edited By: Anil kumar poka

Apr 13, 2022 | 1:05 PM

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్‌ స్పోర్ట్స్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్(CSK) మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది....

CSK vs RCB Highlights: శివం దూబే,  రాబిన్ ఉతప్ప మెరుపు ఇన్సింగ్స్.. 23 పరుగుల తేడాతో సీఎస్కే విజయం..
Ipl Csk Vs Rcb

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్‌ స్పోర్ట్స్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్(CSK) మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. శివం దూబే(Shivam dube) మెరుపు ఇన్సింగ్స్ ఆడాడు. దూబే 46 బంతుల్లో 88(5 ఫోర్లు, 8 సిక్స్‌లు)పరుగులు చేశాడు. రాబిన్‌ ఉతప్పు కూడా చాలా రోజుల తర్వాత క్లాసిక్‌ ఇన్సింగ్స్ ఆడాడు. అతను 50 బంతుల్లో 88(4 ఫోర్లు, 9 సిక్స్‌లు) పరుగులు చేశాడు.

 

రుతురాజ్‌ గైక్వాడ్ 17, మొయిన్ అలీ 3 పరుగులు చేసి రనౌట్ కాగా రవీంద్ర జడేజా డకౌట్‌ అయ్యాడు. ధోనీ బ్యాటింగ్‌కు దిగిన స్ట్రైక్‌ రాలేదు. హసరంగ రెండు వికెట్లు పడగొట్టగా, హాజెల్‌వుడ్‌ ఒక వికెట్ తీశాడు. 217 పరుగుల విజయలక్ష్యంతో బారిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన 193 పరుగులు చేసింది. చెన్నై  బౌలర్లలో తీక్షణ 4 వికెట్లు, జడేజా మూడు, మహేష్ చౌదరి, బ్రవో ఒక్కో వికెట్ పడగొట్టారు.

 

Key Events

వరుస వైఫల్యాలకు చెక్‌ పడేనా..

ఈ సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవి చూసిన చెన్నై ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని చూస్తోంది.

చెన్నైదే ఆధిపత్యం..

ఇక ఇరు జట్ల మధ్య మొత్తం 29 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో చెన్నై జట్టు 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఆర్‌సీబీ జట్టు 9 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, ఒక్క మ్యాచ్ ఫలితం తేలలేదు.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 12 Apr 2022 11:15 PM (IST)

    దినేష్ కార్తిక్ ఔట్..

    బెంగళూరు 9వ వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన దినేష్ కార్తిక్‌ బ్రవో బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

  • 12 Apr 2022 10:59 PM (IST)

    8వ వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో ఆకాష్ దీపు ఔటయ్యాడు.

  • 12 Apr 2022 10:55 PM (IST)

    ఏడో వికెట్‌ కోల్పోయిన బెంగళూరు

    బెంగళూరు ఏడు వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో హసరంగ పెవిలియన్ చేరాడు.

  • 12 Apr 2022 10:49 PM (IST)

    సబాజ్ అహ్మద్ ఔట్..

    బెంగళూరు ఆరో వికెట్ కోల్పోయింది. సబాజ్ అహ్మద్ ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరాడు..

  • 12 Apr 2022 10:34 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన బెంగళూరు

    బెంగళూరు ఐదో వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన సుయష్ ప్రభుదేశాయి ఔటయ్యాడు

  • 12 Apr 2022 10:05 PM (IST)

    మ్యాక్స్‌వెల్‌ ఔట్..

    రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కీలక వికెట్ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్‌ నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు.

  • 12 Apr 2022 10:03 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన బెంగళూరు

    రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మూడో వికెట్ కోల్పోయింది. తిషనక బౌలింగ్‌లో అనుజ్ రావత్ ఔటయ్యాడు.

  • 12 Apr 2022 09:54 PM (IST)

    భారీ వికెట్ కోల్పోయిన బెంగళూరు..

    బెంగళూరుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కోహ్లీ రూపంలో రెండో వికెట్‌ను కోల్పోయింది. ముకేశ్‌ చౌదరీ బౌలింగ్‌లో శివమ్‌ దూబేకు క్యాచ్‌ ఇచ్చిన విరాట్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. కేవలం 20 పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో బెంగళూరు కష్టాల్లోకి వెళుతుంది.

  • 12 Apr 2022 09:46 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన బెంగళూరు..

    చెన్నై ఇచ్చిన 217 పరులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఫాఫ్ డు ప్లెసిస్ 8 పరుగుల వద్ద మహీష్‌ తీక్షణ బౌలింగ్‌లో జోర్డాన్‌ను క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 12 Apr 2022 09:23 PM (IST)

    ముగిసిన తొలి ఇన్నింగ్స్‌.. బెంగళూరు ముందు భారీ లక్ష్యం..

    నాలుగు మ్యాచ్‌ల ఓటమి తర్వాత ఈ మ్యా్చ్‌లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ దంచికొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 216 పరుగులు సాధించింది. జట్టులో శివమ్‌ దూబే (95) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రాబిన్‌ ఉతప్ప (88) పరుగులు సాధించాడు.

  • 12 Apr 2022 09:12 PM (IST)

    ఉతప్ప సెంచరీ మిస్‌..

    చెన్నై స్కోరును ఓ రేంజ్‌లో పరుగులు పెట్టించి రాబిన్‌ ఉతప్ప అవుట్‌ అయ్యాడు. కేవలం 50 బంతుల్లోనే 88 పరుగులు సాధించాడు.

  • 12 Apr 2022 09:07 PM (IST)

    దూసుకుపోతున్న చెన్నై స్కోర్‌..

    చెన్నై భారీ స్కోర్‌ దిశగా దూసుకుపోతోంది. ఉతప్ప, దూబే అద్భుత భాగస్వామ్యం అందించారు. 18 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై స్కోర్‌ 187 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో ఉతప్ప (82), శివమ్‌ దూబే (73) పరుగుల వద్ద కొనసాగుతున్నారు. వీరి భాగస్వామ్యం కేవలం 69 బంతుల్లో 151 పరుగులకు చేరింది.

  • 12 Apr 2022 08:59 PM (IST)

    భారీ స్కోర్‌ దిశగా చెన్నై..

    మ్యాచ్‌ మొదట్లో కాస్త నెమ్మదించిన చెన్నై స్కోర్‌ను శివమ్‌ దూబె, రాబిన్‌ ఉతప్ప పెంచే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే వీరిద్దరి పాట్నర్‌షిప్‌ కేవలం 64 బంతుల్లోనే 133 పరుగులు సాధించారు. ఇక చెన్నై స్కోర్‌ 169 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 12 Apr 2022 08:50 PM (IST)

    100 దాటిన పాట్నర్‌ షిప్‌..

    చెన్నై స్కోరు వేగంగా దూసుకుపోతోంది. రాబిన్‌ ఉతప్ప, శివమ్‌ దూబే దూకుడుగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి 100 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై స్కోర్‌ 145 పరుగుల వద్ద కొనసాగుతోంది. క్రీజులో దూబే (53), ఉతప్ప (65) పరుగుల వద్ద ఉన్నారు.

  • 12 Apr 2022 08:45 PM (IST)

    హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న శివమ్‌ దూబే..

    శివమ్‌ దూబే కూడా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 30 బంతుల్లోనే 50 పరుగులు సాధించాడు. ప్రస్తుతం చెన్నై 15 ఓవర్లు ముగిసే సమయానికి 134 పరగుల వద్ద కొనసాగుతోంది.

  • 12 Apr 2022 08:41 PM (IST)

    ఉతప్ప హాఫ్‌ సెంచరీ..

    రాబిన్‌ ఉతప్ప హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు పెంచే క్రమంలో దూకుడు పెంచిన ఉప్పత వరుస బౌండరీలను బాదుతున్నాడు. ఈ క్రమంలోనే కేవలం 34 బంతుల్లోనే 56 పరుగులు సాధించాడు.

  • 12 Apr 2022 08:35 PM (IST)

    జట్టు స్కోర్‌ పెంచుతోన్న దూబే, ఉతప్ప..

    క్రీజులో ఉన్న శివమ్‌ దూబే, రాబిన్‌ ఉతప్ప జట్టు స్కోరు పెంచే పనిలో పడ్డారు. ఈ క్రమంలో వీరిద్దరు 69 పరుగుల భాగస్వామం సాధించారు. శివమ్‌ దూబే (39), రాబిన్‌ ఉతప్ప (45) పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 12 Apr 2022 08:28 PM (IST)

    నెమ్మదిస్తోన్న చెన్నై స్కోర్..

    వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో చెన్నై స్కోర్‌ నెమ్మదించింది. 12 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై 86 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో శివమ్‌ దూబే (38), రాబిన్‌ ఉతప్ప (27) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.

  • 12 Apr 2022 08:06 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన చెన్నై..

    చెన్నై రెండో వికెట్ కోల్పోయింది. మోయిన్‌ అలీ కేవలం 03 పరుగులు వద్ద రన్‌ అవుట్‌ రూపంలో అవుట్‌ అయ్యాడు.

  • 12 Apr 2022 07:52 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన చెన్నై..

    చెన్నై మొదటి వికెట్‌ను కోల్పోయింది. స్కోర్‌ బోర్డ్‌ను నెమ్మదిగా పెంచుతోన్న దిశలో రీతురాజ్‌ గైక్వాడ్‌ హేజిలవ్‌ వుడ్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం చెన్నై 4 ఓవర్లు ముగిసే సమయానికి 40 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 12 Apr 2022 07:13 PM (IST)

    రెండు జట్ల ప్లేయింగ్ 11..

    చెన్నై సూపర్ కింగ్స్: రవీంద్ర జడేజా (కెప్టెన్), రాబిన్ ఉతప్ప, రీతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, మహేంద్ర సింగ్ ధోని (కీపర్), డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, మహిష్ తీక్షణ, ముకేశ్‌ చౌదరీ.

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (కీపర్), జోష్ హేజిల్‌వుడ్, వనిందు హసరంగా, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, సుయాష్ ప్రభుదేసాయి.

  • 12 Apr 2022 07:05 PM (IST)

    టాస్‌ గెలిచిన బెంగళూరు..

    టాస్‌ గెలిచిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మొదట బౌలింగ్‌ ఎంచుకుంది. పిచ్‌ వికెట్ చేజింగ్‌కు అనుకూలంగా ఉంటుందని చెబుతోన్న అంచనాల మేరకు బెంగళూరు ఈ నిర్ణయం తీసుకుంది. మరి బెంగళూరు టాస్‌ ఏమేర కలిసొస్తుందో చూడాలి.

  • 12 Apr 2022 06:55 PM (IST)

    మీకు తెలుసా..

    * విరాట్ కోహ్లీ చెన్నైకి వ్యతిరేకంగా 1000 పరుగులకు చేరుకోవడానికి కేవలం 52 పరుగుల దూరంలో ఉన్నాడు.
    * RCBకి వ్యతిరేకంగా రవీంద్ర జడేజా 28 ఇన్నింగ్స్‌ల్లో 23 వికెట్లు తీశాడు.
    * దీపక్ చాహర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. CSK ఈ సీజన్‌లో నాలుగు గేమ్‌లలో పవర్‌ప్లేలో కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకోగలిగింది.

Follow us on