
ముంబై ఇండియన్స్ యంగ్ ప్లేయర్, హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ అనారోగ్యం బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. ఈ కారణంగానే శనివారం చెపాక్ వేదికగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌కు తిలక్ వర్మ దూరమయ్యాడు. టాస్ సమయంలో తిలక్ వర్మ అనారోగ్యానికి గురయ్యాడని చెప్పిన రోహిత్ అతని స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు. కాగా ఐపీఎల్ 2023లో అదరగొడుతున్నాడు తిలక్ వర్మ. నిలకడగా పరుగులు సాధిస్తూ ముంబై విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అయితే తిలక్ వర్మకు అనారోగ్యం అన్నప్పటికీ. .అతనికి ఏమైంది..? అని అభిమానులు కలరవరపడుతున్నారు. కాగా ముంబై జట్టులో నిలకడగా రాణిస్తోన్న ఏకైక క్రికెటర్ తిలక్ వర్మ. అలాంటిది అతను గనుకు దూరమైతే ముంబైకి పెద్ద లోటేనని చెప్పుకోవచ్చు. తాజాగా చెన్నై మ్యాచ్‌లోనే ఇది నిరూపితమైంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 138 పరుగులకే పరిమితమైంది. నెహల్ వదేరా (64) మినహా మరెవరూ పెద్దగా పరుగులు చేయకపోవడంతో ముంబై నామమాత్రపు స్కోరును సాధించింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ముంబై జట్టు విధించిన 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై విజయం దిశగా దూసుకెళుతోంది. కడపటి వార్తలందే సమయానికి 15.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు సాధించింది. ప్రస్తుతం ముంబై 9 మ్యాచుల్లో ఐదింట గెలిచి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఉంటే ఆర్సీబీతో పాటు రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ను కూడా అధిగమించి టాప్ -2 జట్టుగా ఉండే అవకాశముంది. అయితే ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే ముంబై విజయం అంత ఈజీ కాదని తెలుస్తోంది.
A fighting total by the boys ?
Let the defence begin. ?#OneFamily #CSKvMI #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 pic.twitter.com/CePxgiLm18
— Mumbai Indians (@mipaltan) May 6, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..