సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు చెలరేగారు. సోమవారం (ఏప్రిల్ 08) చెపాక్ స్టేడియంలో జరుగుతోన్న మ్యాచ్ లో కోల్ కతా బ్యాటర్లను కట్డడి చేశారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఆరంభం నుంచే కోల్ కతా బ్యాటర్లపై దాడికి దిగారు సీఎస్కే బౌలర్లు. పేసర్లతో పాటు స్పిన్నర్లు కూడా కట్టుదిట్టంగా బంతులేయడంతో కోల్ కతా బ్యాటర్లు పరుగులు తీయడానికి నానా తంటాలు పడ్డారు. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సునీల్ నరైన్ (27), రఘువంశీ (24) పరుగులు చేశారు.
కోల్‌కతాలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 32 బంతుల్లో 3 ఫోర్లతో 34 పరుగులు చేశాడు. సునీల్ నరైన్ 27, అంగీక్రిష్ రఘువంశీ 24, రమణదీప్ సింగ్ 13, ఆండ్రీ రస్సెల్ 10 పరుగులు చేశారు. కాగా జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో రింకూ సింగ్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించారు. కానీ రింకూ 9 పరుగుల కే ఔటయ్యాడు. వెంకటేష్ అయ్యర్, అనుకుల్ రాయ్ ఇద్దరూ చెరో 3 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నారు. ఫిలిప్ సాల్ట్, మిచెల్ స్టార్క్ ఇద్దరూ కనీసం ఖాతాను కూడా తెరవలేకపోయారు. . వైభవ్ అరోర్ 1 పరుగుతో నాటౌట్ గా వెనుదిరిగాడు. చెన్నై తరఫున రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే చెరో 3 వికెట్లు తీశారు. ముస్తాఫిజుర్ రెహమాన్ 2 వికెట్లు తీసి మళ్లీ పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. మహిష్ తిక్షణ 1 వికెట్ తీశాడు.
Innings Break ‼️
Some tight & disciplined bowling from Chennai Super Kings restrict #KKR to 137/9.
Will it be defended or #CSK register another win at home 🤔
Scorecard ▶ https://t.co/5lVdJVscV0 #TATAIPL | #CSKvKKR pic.twitter.com/zUR3IMuOeS
— IndianPremierLeague (@IPL) April 8, 2024
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్: రితురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తిక్షణ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..