CSK vs DC Highlights: ఐపీఎల్ 2022లో భాగంగా 55వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై 91 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ కేవలం 17.4 ఓవరల్లో 117 పరుగులకే చేతులెత్తేసింది. చెన్నై బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాట్స్‌మెన్స్ ఎవ్వరూ క్రీజులో నిలవలేకపోయారు. శార్దుల్ ఠాగూర్ 24 పరుగులు, రిషబ్ పంత్ 21 పరుగులు చేశారు. జట్టులో ఎవ్వరూ 30 పరుగులు కూడా చేయలేకపోయారు. ఇక చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ 3, డ్వేన్ బ్రేవో 2, ముఖేష్ చౌదరీ2, సిమర్‌జీత్ సింగ్ 2, మహేశ్ తీక్షణ 1 వికెట్ సాధించారు. ఈ ఓటమితో దిల్లీ (10 పాయింట్లు) తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరోవైపు అద్భుత విజయం సాధించిన చెన్నై (8) పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంది.
అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు సాధించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 209 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. చెన్నై ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. సెంచరీ భాగస్వామ్యంతో కీలక ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై భారీ స్కోర్ సాధించింది. ఈ క్రమంలో రుతురాజ్ గైక్వాడ్ 41 పరుగులు చేసిన తర్వాత నార్ట్జే బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వీరిద్దరి మధ్య 110 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఢిల్లీ బౌలర్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. చివర్లో వికెట్లు పడగొట్టారు. ఖలీల్ అహ్మద్ 2, నార్ట్జే 3, మార్ష్ 1 వికెట్ పడగొట్టారు.
ఇరు జట్లు..
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, మొయిన్ అలీ, ఎంఎస్ ధోని(కీపర్/కెప్టెన్), శివమ్ దూబే, డ్వేన్ బ్రావో, మహేశ్ తీక్షణ, సిమర్‌జీత్ సింగ్, ముఖేష్ చౌదరి
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, శ్రీకర్ భరత్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నార్ట్జే
ఢిల్లీ 17.4 ఓవరల్లో 117 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో చెన్నై 91 పరుగుల తేడాతో విజయం సాధించింది. జట్టులో మిచెల్ మార్ష్ 25 పరుగులు అత్యధిక స్కోరు. శార్దుల్ ఠాగూర్ 24 పరుగులు, రిషబ్ పంత్ 21 పరుగులు చేశారు. జట్టులో ఎవ్వరూ 30 పరుగులు చేయలేకపోయారు. ఇక చెన్నై బౌలర్లు వీరవిహారం చేశారు. ఢిల్లీ బ్యాట్స్‌మెన్స్‌ని ఓ ఆట ఆడుకున్నారని చెప్పవచ్చు. మొయిన్ అలీ 3, డ్వేన్ బ్రేవో 2, ముఖేష్ చౌదరీ2, సిమర్‌జీత్ సింగ్ 2, మహేశ్ తీక్షణ 1 వికెట్ సాధించారు.
ఢిల్లీ 15.3 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి100 పరుగులు దాటింది. క్రీజులో శార్ధుల్ 8 పరుగులు, అన్రిచ్ నార్ట్జే 1 పరుగుతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 25 బంతుల్లో 107 పరుగులు కావాలి. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ 3, ముఖేష్ చౌదరీ2, సిమర్‌జీత్ సింగ్ 2, మహేశ్ తీక్షణ 1 వికెట్ సాధించారు.
ఢిల్లీ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కుల్‌దీప్ యాదవ్ 5 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ 15.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 28 బంతుల్లో 110 పరుగులు కావాలి. సిమర్జీత్ సింగ్ బౌలింగ్‌లో ఊతప్ప క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు.
ఢిల్లీ 15 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. క్రీజులో శార్ధుల్ 8 పరుగులు, కుల్‌దీప్ యాదవ్ 5 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 30 బంతుల్లో 110 పరుగులు చేయాల్సి ఉంది. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ 3, ముఖేష్ చౌదరీ2, మహేశ్ తీక్షణ 1, సిమర్‌జీత్ సింగ్ 1 వికెట్ సాధించారు.
ఢిల్లీ ఏడో వికెట్ కోల్పోయింది. రొవ్‌మన్ పావెల్ 3 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ 10.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 55 బంతుల్లో 124 పరుగులు కావాలి. ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో ధోని క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు.
ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. అక్సర్ పటేల్ 1 పరుగుకే ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ 10.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 58 బంతుల్లో 126 పరుగులు కావాలి.
ఢిల్లీ 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజులో అక్సర్ పటేల్ 1 పరుగు, రొవ్‌మన్ పావెల్ 2 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 60 బంతుల్లో 127 పరుగులు చేయాల్సి ఉంది. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ 3, మహేశ్ తీక్షణ 1, సిమర్‌జీత్ సింగ్ 1 వికెట్ సాధించారు.
ఢిల్లీ ఐదో వికెట్ కోల్పోయింది. రిపాల్ పటేల్ 6 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ 9.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 60 బంతుల్లో 127 పరుగులు కావాలి. మొయిన్ ఆలీ బౌలింగ్‌లో కాన్‌వే క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు.
ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. రిషబ్ పంత్ 21 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ 9.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 65 బంతుల్లో 134 పరుగులు కావాలి. మొయిన్ ఆలీ బౌలింగ్‌లో భారీషాట్ ఆడబోయిన పంత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. మిచెల్ మార్ష్ 25 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ 7.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 72 బంతుల్లో 136 పరుగులు కావాలి. మొయిన్ ఆలీ బౌలింగ్‌లో భారీషాట్‌ఆడిన మార్ష్ గైక్వాడ్ చేతికి చిక్కడంతో ఔటయ్యాడు.
ఢిల్లీ 7 ఓవర్లకి 2 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 79 బంతుల్లో 138 పరుగులు చేయాలి. క్రీజులో రిషబ్ పంత్ 19 పరుగులు, మార్ష్ 25 పరుగులతో ఆడుతున్నారు.
మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ టీం ఒక వికెట్ కోల్పోయి 28 పరుగులు చేసింది. వార్నర్ 14, మార్ష్ 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
శ్రీకర్ భరత్ (8) రూపంలో ఢిల్లీ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. సింగ్ బౌలింగ్‌లో అలీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 2 ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ టీం ఒక వికెట్ కోల్పోయి 17 పరుగులు పూర్తి చేసింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు సాధించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 209 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. రుతురాజ్ గైక్వాడ్ 41 పరుగులు చేసిన తర్వాత నార్ట్జే బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాన్వే (87 పరుగులు, 49 బంతులు, 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరి, టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2, నార్ట్జే 3, మార్ష్ 1 వికెట్ పడగొట్టారు.
చివరి ఓవర్ బౌలింగ్ చేస్తోన్న నార్ట్జే వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసుకున్నాడు. అలీ, ఉతప్పలను పెవిలియన్ చేర్చాడు.
19 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు పూర్తి చేసింది. ధోనీ 17(6 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్), అలీ 5 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
రాయుడు (5 ) రూపంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 18.2 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు సాధించింది.
శివం దూబే (32 పరుగులు, 19 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రూపంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 17.1 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం 3 వికెట్లు కోల్పోయి 170 పరుగులు సాధించింది.
డేవాన్ కాన్వే (87 పరుగులు, 49 బంతులు, 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) రూపంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 16.3 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం 2 వికెట్లు కోల్పోయి 169 పరుగులు సాధించింది.
14 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం ఒక వికెట్ కోల్పోయి 140 పరుగులు పూర్తి చేసింది. డేవాన్ కాన్వే 83(43 బంతులు, 7 ఫోర్లు, 5 సిక్సులు), శివం దూబే 8 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
12 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం 10.17 రన్‌రేట్‌తో 122 పరుగులు పూర్తి చేసింది. డేవాన్ కాన్వే 74(38 బంతులు, 7 ఫోర్లు, 4 సిక్సులు), శివం దూబే 2 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
ఎట్టకేలకు ఢిల్లీ బౌలర్లు ధాటిగా ఆడుతోన్న చెన్నై ఓపెనర్లకు అడ్డుకట్ట వేశారు. నార్ట్జే బౌలింగ్‌లో రుతారాజ్ గైక్వాడ్(41 పరుగులు, 33 బంతులు, 4 ఫోర్లు, 1సిక్స్) అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఓపెనర్ల తుఫాన్ బ్యాటింగ్‌తో చెన్నై టీం భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో 10 ఓవర్లు పూర్తయ్యే సరికి 10 రన్‌రేట్‌తో 100 పరుగులు పూర్తి చేసింది. రుతురాజ్ 32, డేవాన్ కాన్వే 63 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
చెన్నై ఓపెనర్ల అద్భుత బ్యాటింగ్‌తో సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో డేవాన్ కాన్వే కేవలం 27 బంతుల్లో అర్థసెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. మొత్తంగా 9 ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై టీం వికెట్లేమీ నష్టపోకుండా 84 పరుగులు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తోన్న చెన్నై టీం.. ఓపెనర్ల తుఫాన్ బ్యాటింగ్‌తో పటిష్ట స్థితికి చేరుకుంటోంది. భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో 8 ఓవర్లు పూర్తయ్యే సరికి 79 పరుగులు పూర్తి చేసింది. రుతురాజ్ 27, డేవాన్ కాన్వే 48 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
చెన్నై స్కోరు 50 దాటింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (23), డెవాన్ కాన్వే (29) ధాటిగా ఆడుతున్నారు. పవర్ ప్లే ముగిసే సరికి చెన్నై 57/0 రన్స్ చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తోన్న చెన్నై టీం.. మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి 24 పరుగులు పూర్తి చేసింది. రుతురాజ్ 11, డేవాన్ కాన్వే 11 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, శ్రీకర్ భరత్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నార్ట్జే
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, మొయిన్ అలీ, ఎంఎస్ ధోని(కీపర్/కెప్టెన్), శివమ్ దూబే, డ్వేన్ బ్రావో, మహేశ్ తీక్షణ, సిమర్‌జీత్ సింగ్, ముఖేష్ చౌదరి
పది జట్లలో ఢిల్లీ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. పది మ్యాచ్‌లలో పది పాయింట్లతో నిలిచింది. చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 21 పరుగుల తేడాతో ఓడించింది. నేటి మ్యాచ్‌లో గెలిస్తే టాప్ 4లో చేరుతుంది. అదే సమయంలో చెన్నై జట్టు 6 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్ నెట్ బౌలర్‌కు కోవిడ్ -19 సోకినట్లు తేలడంతో, మరోసారి ఆటగాళ్ళు ఐసోలేషన్‌లో ఉండాల్సి వచ్చింది.
ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించే దశలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈరోజు ధోనీకి తన శిష్యుడు రిషబ్ పంత్ ముందు ఒక సవాలు ఎదురైంది.