Chennai Super Kings vs Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 55వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసింది.
ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ 24 పరుగులు చేశాడు. చివరిగా, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 9 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 20 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.
ఢిల్లీ తరపున మిచెల్ మార్ష్ మూడు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (కీపర్), మిచెల్ మార్ష్, రిలీ రోసోవ్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..