ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చెన్నై సూపర్ కింగ్స్(CSK)లో పదేళ్లుగా కీలక ఆటగాడిగా ఉంటున్నాడు. అందుకే అతడిని చెన్నై రిటైన్ చేసుకుంది. అయితే అతను సీఎస్కే ఫ్రాంచైజీ ఇన్‌స్టాగ్రామ్‌ను అన్‌ఫాలో చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022కు జడేజా గాయం కారణంగా దూరమయ్యాడు. మే 4న రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన జడేజా గాయపడ్డాడు. ” గత ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్(DC)తో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా పక్కటెముల గాయం కారణంగా ఆడలేదు. అతను మెడికల్ పరిశీలనలో ఉన్నాడు. వైద్యుల సూచన మేరకు ఈ ఐపీఎల్ సీజన్‌కు అతనికి విశ్రాంతి ఇచ్చాం” అని జట్టు యాజమాన్యం ప్రకటన చేసింది. అతని ఆకస్మిక తొలగింపు, అతను ఇన్‌స్టాగ్రామ్ అన్‌ఫాలో చేయడంతో ఫ్రాంచైజీతో విభేదాలు వచ్చినట్లు పుకార్లు వస్తున్నాయి.
అయితే ఎలాంటి విభేదాలు లేవని ఫ్రాచైంజీ సీఈఓ విశ్వనాథన్ చెప్పారు. వైద్యుల సూచన మేరకే జడేజాకు విశ్రాంతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. IPL 2022లో CSK కోసం ఈ ఆల్ రౌండర్‌ను సీఎస్కే రూ. 16 కోట్లకు రిటైన్ చేసుకుంది. టోర్నమెంట్ ప్రారంభానికి రెండు రోజుల ముందు అతను జట్టుకు కెప్టెన్‌గా కూడా నియమితుడయ్యాడు. అయితే అతని కెప్టెన్సీలో CSK వారి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరింటిలో ఓడిపోయింది. జడేజా తన ఫామ్‌ను కూడా కోల్పోయాడు. అతను 8 మ్యాచ్‌లలో కేవలం 111 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు సాధించాడు. తర్వాత అతను తన స్వంత ఆటపై దృష్టి పెట్టడానికి జట్టు కెప్టెన్సీని వదులుకున్నాడు. దీంతో జట్టు యాజమాన్యం ధోనికి తిరిగి కెప్టెన్సీ అప్పగించింది.
Read also.. David Warner: ఆరెంజ్ క్యాప్ రేసులో డేవిడ్ వార్నర్.. 427 పరుగులతో మూడో స్థానానికి చేరిన డీసీ ఆటగాడు..