CSK IPL Auction 2021: ఈ ఏడాది ఐపీఎల్ కప్పు కొట్టే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి జట్టు ఎంపికలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చెన్నైలో గురువారం జరిగిన వేలానికి రూ.19.90 కోట్లతో ఆరుగురు ప్లేయర్స్‌ని టీమ్‌లోకి తీసుకుంది. ఇందులో భాగంగానే ఇద్దరు ఆల్‌రౌండర్లను తీసుకుంది.
ఇక ఐపీఎల్ 2021 వేలంలో హర్భజన్ సింగ్, షేన్ వాట్సన్, మోను సింగ్, పీయూష్ చావ్లా, మురళీ విజయ్, కేదార్ జాదవ్‌లను వదిలేసుకున్న.. చెన్నై సూపర్ కింగ్స్.. గురువారం జరిగిన వేలంలో పలువురిని జట్టులోకి చేర్చుకుంది. ఈ క్రమంలో కె. గౌతమ్ (రూ.9.25 కోట్లు), మొయిన్ అలీ (రూ.7 కోట్లు) పుజారా (రూ.50 లక్షలు), హరిశంకర్ రెడ్డి (రూ.20 లక్షలు), రాబిన్ ఉతప్ప (రూ.2 కోట్లు), భగవత్ వర్మ (రూ.20 లక్షలు), సి. హరి నిశాంత్ (రూ. 20 లక్షలు)లను కొనుగోలు చేసింది. దీంతో చెన్నై జట్టులోకి కొత్తగా ఏడుగురు ప్లేయర్స్ వచ్చారు.
ఇక ఐపీఎల్ 2021 చైన్న సూపర్ కింగ్స్ పూర్టి జట్టు విషయానికొస్తే.. మహేంద్రసింగ్ ధోనీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, కేఎం ఆసిఫ్, దీపక్ చాహర్, డ్వేన్ బ్రావో, డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్, జగదీశన్, కర్ణ్ శర్మ, లుంగి ఎంగిడి, మిచెల్ శాంట్నర్, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, శార్ధూల్ ఠాకూర్, శామ్ కరన్, జోష్ హేజిల్‌వుడ్, ఆర్. సాయి కిషోర్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, గౌతమ్, చతేశ్వర్ పుజారా, హరిశంకర్ రెడ్డి (కడప జిల్లా), భగత్ వర్మ, హరి నిశాంత్.
New entrants into the #SuperFam! #WhistlePodu #Yellove ?? pic.twitter.com/sSLqD0jESp
— Chennai Super Kings (@ChennaiIPL) February 18, 2021
Also Read: IPL 2021 Auction Sold Players: స్మిత్ ఢిల్లీకి, మ్యాక్సీ ఆర్‌సీబీకి.. అమ్ముడుపోయిన ఆటగాళ్ల లిస్టు ఇదే..
IPL 2021 Auction Unsold Players: వేలంలో అమ్ముడుపోని ఫించ్, రాయ్, విహారి, మరికొందరు.. ఆ లిస్ట్ ఇదే.!
RCB IPL Auction 2021: వ్యూహాత్మకంగా జట్టును ఎంపిక చేసుకున్న ఆర్‌సీబీ.. కేవలం ఇద్దరి కోసమే ఏకంగా రూ. 29.25 కోట్లు..