IPL 2024: వైజాగ్ దెబ్బకు చెన్నై అగ్రస్థానం గల్లంతు.. పాయింట్ల పట్టికలో కీలక మార్పులు..
IPL 2024 Points Table: రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. అలాగే, రన్ రేట్ +0.976లుగా నిలిచింది.

IPL 2024 Points Table: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) టోర్నమెంట్ ప్రారంభమై వారం దాటింది. ఇప్పటివరకు మొత్తం పదమూడు మ్యాచ్‌లు జరిగాయి. ఆదివారం రెండు మ్యాచ్‌లు జరిగాయి. అహ్మదాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విశాఖపట్నంలో జరిగిన మరో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. ఐపీఎల్‌లో నేడు ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. IPL 2024 పాయింట్ల పట్టిక ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో స్థానం నుంచి అగ్రస్థానానికి ఎగబాకింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 4 పాయింట్లు సాధించింది. నెట్ రన్ రేట్ +1.047గా నిలిచింది.
రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచింది. ఒకదాంట్లో ఓడిపోయింది. నాలుగు పాయింట్లతోపాటు రన్ రేట్ +0.976గా నిలిచింది.
సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లు గెలిచి నాలుగు పాయింట్లు, +0.800 రన్ రేట్‌ను కలిగి ఉంది.
ఎనిమిదో స్థానంలో ఉన్న శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పుడు నాలుగో స్థానానికి చేరుకుంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో గెలిచి 4 పాయింట్లు సాధించింది. అలాగే, నెట్ రన్ రేట్ -0.738లుగా నిలిచింది.
కాగా, పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు పరాజయాలు, ఒక విజయం సాధించి 2 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో ఉంది. ఇక నెట్ రన్ రేట్ +0.204లుగా నిలిచింది.
కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆరో స్థానంలో ఉంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో విజయం, ఒక ఓటమి చవిచూసి 2 పాయింట్లు సాధించింది. అలాగే నెట్ రన్ రేట్ +0.025లుగా నిలిచింది.
రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడి రెండు పాయింట్లతో ఒకటి గెలిచి ఏడో స్థానంలో ఉంది. అలాగే, నెట్ రన్ రేట్ -0.016లుగా నిలిచింది.
శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి రెండింట్లో ఓడి 2 పాయింట్లు సాధించి ఎనిమిదో స్థానంలో ఉంది. నికర రన్ రేట్ +0.337లుగా నిలిచింది.
ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎనిమిదవ స్థానానికి పడిపోయింది. ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండు పరాజయాలు, ఒక విజయం సాధించి 2 పాయింట్లు సాధించింది. ప్రస్తుత నెట్ రన్ రేట్ -0.711లుగా నిలిచింది.
హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్లు సాధించకుండా పదో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ -0.925లుగా నిలిచింది.
ఆరెంజ్ క్యాప్ జాబితాలో ఆర్‌సీబీ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మొత్తం 181 పరుగులు చేశాడు. హైదరాబాద్‌కు చెందిన హెన్రిచ్ క్లాసెన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 167 పరుగులు చేశాడు. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ తాను ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 137 పరుగులు చేసి మూడో స్థానానికి ఎగబాకాడు.
పర్పుల్ క్యాప్ జాబితాలో సీఎస్‌కే ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్ మొత్తం 7 వికెట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆయన వెనుక గుజరాత్‌కు చెందిన మోహిత్ శర్మ ఉన్నాడు. అతను ఆడిన మూడు మ్యాచ్‌లలో 6 వికెట్లు తీసుకున్నాడు. ఢిల్లీకి చెందిన ఖలీల్ అహ్మద్ 5 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..