Cricket News: పేరు తెలియని వ్యాధితో చనిపోయిన ఫేమస్ క్రికెటర్.. 25 సెంచరీలు, 14 వేల పరుగులు..

|

Jan 15, 2022 | 10:40 AM

Cricket News: క్రికెట్ చరిత్రలో ఎన్నో మరుపురాని సంఘటనలు జరిగాయి. మైదానంలో చాలా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రేక్షకుల

Cricket News: పేరు తెలియని వ్యాధితో చనిపోయిన ఫేమస్ క్రికెటర్.. 25 సెంచరీలు, 14 వేల పరుగులు..
Wilfred Slack
Follow us on

Cricket News: క్రికెట్ చరిత్రలో ఎన్నో మరుపురాని సంఘటనలు జరిగాయి. మైదానంలో చాలా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రేక్షకుల అల్లర్ల నుంచి ఆటగాళ్ల పోరాటాలు, క్రికెటర్ల మరణాల వరకు ఎన్నో ఘటనలు జరిగాయి. మ్యాచ్‌లో బంతి తగిలి ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మెన్ ఫిలిప్ హగ్ మరణించిన సంగతి తెలిసిందే. అలాగే ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌కి చెందిన ఓ క్రికెటర్ కూడా మైదానంలో మరణించిన సంఘటన జరిగింది. కానీ ఈ మరణం బంతి తగలడం వల్ల కాదు. చాలా కాలంగా ఉన్న వ్యాధి కారణంగా. ఈ క్రికెటర్ పేరు విల్ఫ్ స్లాక్. జనవరి 15 అతడి వర్ధంతి. సరిగ్గా 33 ఏళ్ల క్రితం ఇదే రోజు క్రికెట్ ఆడుతూ మైదానంలోనే చనిపోయాడు. 34 ఏళ్ల వయసులో ఓ క్రికెటర్‌ ప్రాణాలను బలిగొన్న ఈ యాక్సిడెంట్‌ ఎలా జరిగింది. ఏ జబ్బు అతని ప్రాణాలు తీసింది. అతని క్రికెట్ కెరీర్ ఎలా ఉంది తదితర విషయాలు తెలుసుకుందాం.

ఇంగ్లాండ్ జట్టుతో కెరీర్ ప్రారంభం

విల్ఫ్ స్లాక్ 1954 డిసెంబర్ 12న కరీబియన్ దీవిలోని సెయింట్ విన్సెంట్‌లో జన్మించాడు. తర్వాత కొన్నిరోజులకు కుటుంబంతో సహా ఇంగ్లండ్ లోని బకింగ్ హామ్ షైర్ చేరుకున్నాడు. ఇక్కడే అతని చదువు, క్రికెట్‌ మొదలయ్యాయి. 21 సంవత్సరాల వయస్సులో అతను మైనర్ కౌంటీలోని బకింగ్‌హామ్‌షైర్ జట్టులో భాగమయ్యాడు. అక్కడ అతని మంచి ప్రదర్శన మిడిల్‌సెక్స్ కౌంటీ జట్టులో చోటు సంపాదించింది. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి మీడియం పేసర్. విల్ఫ్ 1977 కౌంటీ సీజన్‌లో మిడిల్‌సెక్స్‌లో అరంగేట్రం చేశాడు.

కొన్నాళ్లు వేచిచూసిన తర్వాత 1986లో తొలిసారి ఇంగ్లండ్ క్రికెట్ జట్టు నుంచి పిలుపొచ్చింది. అతను వెస్టిండీస్ పర్యటనలో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్ట్‌లో అరంగేట్రం చేసాడు. రెండు ఇన్నింగ్స్‌లలో రెండు పరుగులు మాత్రమే చేశాడు. దీంతో తర్వాత రెండు టెస్టులకు తొలగించారు. చివరి టెస్టులో అతను 52 పరుగులు చేశాడు. అదే ఏడాది ఇంగ్లండ్‌కు వెళ్లిన భారత జట్టుతో జరిగిన హెడ్డింగ్‌లే టెస్టులో అతనికి అవకాశం లభించింది కానీ అతను విఫలమయ్యాడు. ఆపై జట్టు నుంచి శాశ్వతంగా తొలగించారు.

తెలియని వ్యాధి, ప్రాణం తీసింది

పేరు తెలియని వ్యాధి నెమ్మదిగా విల్ఫ్ కెరీర్‌ను ప్రభావితం చేయడం ప్రారంభించి ఆపై శాశ్వతంగా ముగించింది. 1980ల మధ్యకాలంలో, విల్ఫ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ‘బ్లాక్ అవుట్’తో సమస్యలను ఎదుర్కొన్నాడు. నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా ఒక్కసారిగా కళ్ల ముందు చీకటి కమ్ముకోవడంతో అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. విల్ఫ్‌కి వైద్యం చేయించారు కానీ పరీక్షలో ఏ వ్యాధి అనేది బయటపడలేదు. ఆపై 1989 పర్యటన వచ్చింది అప్పుడే విల్ఫ్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. అతను చిన్న జట్లతో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అలాంటి ఒక పర్యటన కోసం గాంబియాకు వెళ్ళాడు. అక్కడ జనవరి 15న జరిగిన మ్యాచ్‌లో అకస్మాత్తుగా మైదానంలో పడిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినా విల్ఫ్‌ను రక్షించలేకపోయారు. 34 సంవత్సరాల వయస్సులో మరణించాడు.

విల్ఫ్ కెరీర్

విల్ఫ్ అంతర్జాతీయ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. అతను కేవలం 3 టెస్టులు ఆడాడు అందులో అతని బ్యాట్ నుంచి 81 పరుగులు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో అతను 2 వన్డేల్లో 43 పరుగులు మాత్రమే చేశాడు. అయితే విల్ఫ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. అతని సుదీర్ఘ కెరీర్‌లో విల్ఫ్ 237 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను దాదాపు 14,000 పరుగులు (13950) చేశాడు. 25 సెంచరీలు సాధించాడు. దీంతో పాటు అతని ఖాతాలో 21 వికెట్లు కూడా ఉన్నాయి.

ఈ ప్రభుత్వ పథకంలో డబ్బు సులువుగా రెట్టింపు.. అంతేకాదు సురక్షితం కూడా..?

Credit Card Charges: క్రెడిట్‌ కార్డ్‌ ఆలస్య చెల్లింపుపై ఏ బ్యాంకు ఎంత ఛార్జ్‌ చేస్తుందో తెలుసా..?

అందమైన రూపం.. అద్భుత డ్యాన్స్‌ కలబోస్తే ఆమె.. నటన కోసం పాఠశాలనే విడిచిపెట్టిన ‘సితార’