శబాష్.. హిట్‌మ్యాన్.. ట్వీట్లతో సెలెబ్రిటీల జోష్!

మాంచెస్టర్ వేదికగా దాయాది పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పాక్ బౌలర్లకు విశ్వరూపం చూపిస్తున్నాడు. 85 బంతుల్లో తన సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. 140 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టాడు. ఇకపోతే ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో రోహిత్ శర్మ అద్భుతంగా రాణించడంపై భారత్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. సఫారీలపై 122, ఆస్ట్రేలియాపై 57, పాకిస్థాన్‌పై 132* పరుగులు రోహిత్ శర్మ చేయడంతో.. అటు మాజీ క్రికెటర్లు కూడా ట్విట్టర్ […]

శబాష్.. హిట్‌మ్యాన్.. ట్వీట్లతో సెలెబ్రిటీల జోష్!
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 16, 2019 | 5:41 PM

మాంచెస్టర్ వేదికగా దాయాది పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పాక్ బౌలర్లకు విశ్వరూపం చూపిస్తున్నాడు. 85 బంతుల్లో తన సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. 140 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టాడు. ఇకపోతే ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో రోహిత్ శర్మ అద్భుతంగా రాణించడంపై భారత్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. సఫారీలపై 122, ఆస్ట్రేలియాపై 57, పాకిస్థాన్‌పై 132* పరుగులు రోహిత్ శర్మ చేయడంతో.. అటు మాజీ క్రికెటర్లు కూడా ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం 39 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్య(4), కెప్టెన్ విరాట్ కోహ్లీ(30) క్రీజులో ఉన్నారు.