W, W, W, W, W.. ఓవర్‌లో 5 వికెట్లు, 3 ఫార్మాట్లలో హ్యాట్రిక్ తీసిన టీమిండియా బౌలర్.. 9 మ్యాచ్‌లకే కెరీర్ క్లోజ్

Unbreakable Cricket Records: భారత క్రికెట్‌లో చాలా మంది దిగ్గజ బౌలర్లు ఉన్నారు. బౌలర్ల రికార్డుల జాబితా రోజురోజుకూ పెరిగి పెద్దదవుతోంది. కానీ ఇప్పుడు చెప్పబోయే బౌలర్ మాత్రం ఒకే ఓవర్లో 5 వికెట్లు తీసి సంచలనంగా మారాడు. ఈ భారతీయ బౌలర్ మూడు ఫార్మాట్లలో హ్యాట్రిక్ రికార్డుతో హల్చల్ చేశాడు.

W, W, W, W, W.. ఓవర్‌లో 5 వికెట్లు, 3 ఫార్మాట్లలో హ్యాట్రిక్ తీసిన టీమిండియా బౌలర్.. 9 మ్యాచ్‌లకే కెరీర్ క్లోజ్
Abhimanyu Mithun

Updated on: Apr 23, 2025 | 12:47 PM

Unbreakable Cricket Records: భారత క్రికెట్ ప్రతిభకు నిలయం అనే సంగతి తెలిసిందే. అయితే, దేశం తరపున ఆడాలనే ప్రతి ఆటగాడి కల నెరవేరకపోవచ్చు. ఎందుకంటే, భారత జట్టులో ఆడే అవకాశం అందరికీ దక్కకపోవచ్చు. ప్రతిభ ఉన్నా అవకాశం రాక సాధారణ ఆటగాడిగానే మిగిలిపోతుంటారు. ఇలాంటి ప్లేయర్లు చాలామందే కనిపిస్తారు. ఇలాంటి కోవకే చెందినో ఓ ప్లేయర్ ఒకే ఓవర్లో ఐదు వికెట్లు తీసిన రికార్డుతో సంచలనంగా మారాడు. అయితే, ఈ బౌలర్ మూడు ఫార్మాట్లలోనూ హ్యాట్రిక్ సాధించిన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. కానీ, నిరంతరం అవకాశాలు దక్కకపోవడంతో, కెరీర్ చాలామందికి తెలియకుమానే ముగిసిపోయింది.

కెరీర్ చాలా చిన్నది..

అభిమన్యు మిథున్‌లో ప్రతిభకు కొదవలేదు. కానీ, టీమ్ ఇండియాలో ఎక్కువ కాలం ఉండలేకపోయాడు. అతను టెస్టులు, వన్డేలు కలిపి మొత్తం 9 అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. దేశీయ క్రికెట్‌లో మాత్రం ఒక సంచలనంగా నిలిచాడు. ఏ బౌలర్ కెరీర్‌కైనా హ్యాట్రిక్ ఎనలేని కీర్తిని అందిస్తుంది. కానీ, అభిమన్యు మిథున్ దేశవాళీ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో హ్యాట్రిక్‌లు సాధించడం ద్వారా ఒక ప్రత్యేకమైన రికార్డును సృష్టించాడు. ఇది మాత్రమే కాదు, అతను ఒకే ఓవర్‌లో 5 వికెట్లు తీసిన ఘనతను కూడా సాధించాడు.

మూడు ఫార్మాట్లలో హ్యాట్రిక్‌లు..

రెండు హ్యాట్రిక్‌లకు ముందే, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 5గురు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేయడంతో అభిమన్యు పేరు వార్తల్లో నిలిచింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్ మొదటి నాలుగు బంతుల్లో హిమాన్షు రాణా, రాహుల్ తెవాటియా, సుమిత్ కుమార్, అమిత్ మిశ్రా వంటి బ్యాట్స్‌మెన్‌లను మిథున్ అవుట్ చేశాడు. ఆ తర్వాత, ఒక వైడ్ బాల్ అతని మ్యాజిక్ స్పెల్‌కు అంతరాయం కలిగించింది. ఆ తర్వాత చివరి బంతికి జయంత్ యాదవ్ వికెట్ తీయడం ద్వారా, అతను ఈ స్పెల్‌ను చరిత్ర పుటల్లో నమోదు చేశాడు. 2021 సంవత్సరంలో, అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..